Share News

సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్.. జన్మ ఆధారిత పౌరసత్వం రద్దు కేసు విచారణకు హాజరు..

ABN , Publish Date - Apr 02 , 2026 | 09:28 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ (జన్మ ఆధారిత పౌరసత్వం) మార్పులపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు.

సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్.. జన్మ ఆధారిత పౌరసత్వం రద్దు కేసు విచారణకు హాజరు..
Donald Trump citizenship rule

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ (జన్మ ఆధారిత పౌరసత్వం) మార్పులపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. సుప్రీంకోర్టు విచారణకు హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. గంటకు పైగా సుప్రీంకోర్టులో ఉన్న ట్రంప్ ఈ కేసుపై వాదనలను విన్నారు (US Supreme Court).


అక్రమ వలసదారుల సంతానానికి, తాత్కాలిక నివాసితులకు పుట్టిన పిల్లలకు జన్మ ఆధారంగా లభించే దేశ పౌరసత్వాన్ని నిరాకరిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పౌరసత్వంపై ట్రంప్ విధించిన పరిమితులను అమెరికాలోని పలు కోర్టులు కొట్టేశాయి. అధ్యక్షుడి ఉత్తర్వుల అమలును నిలిపివేశాయి. వీటిని సవాలు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ అప్పీలుపై బుధవారం విచారణ జరిగింది. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌లో మార్పుల చట్టబద్ధతపై న్యాయవాదులు సందేహాలు వ్యక్తం చేశారు (Donald Trump citizenship rule).


అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం ఇవ్వాలని పేర్కొనే 14వ రాజ్యంగ సవరణ ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిమితులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు వాదిస్తున్నారు. విచారణ సమయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులు ట్రంప్ ప్రభుత్వ వాదనలను ప్రశ్నించారు. రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్న నిబంధనలను ఎలా మార్చగలరని, జన్మ ఆధారిత పౌరసత్వంపై కార్యనిర్వాహక ఆదేశాలు చెల్లుబాటు అవుతాయా అని ప్రశ్నించారు (Birthright citizenship US).


ఈ కేసులో సుప్రీంకోర్టు త్వరలోనే తుదితీర్పు వెలువరించే అవకాశం ఉంది (Trump immigration policy). ఏదేమైనా ఈ తీర్పు అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. భవిష్యత్తులో పౌరసత్వ హక్కులపై కీలక మార్పులకు ఈ తీర్పు దారి తీస్తుందనడంలో సందేహం లేదు.


ఇవి కూడా చదవండి..

ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..


పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 02 , 2026 | 09:30 AM