Share News

ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:52 AM

గురువారం తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో సముద్రం అడుగున భూమి కంపించింది.

ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Indonesia quake today

గురువారం తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో సముద్రం అడుగున భూమి కంపించింది. టెర్నెట్ ద్వీపానికి 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉంది. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని యూఎస్ పర్యవేక్షణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది (Indonesia quake today).


ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాల వెంబడి భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర సునామీ (Tsunami alert news) అలలు సంభవించే అవకాశం ఉందని హవాయికి చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. దీంతో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా ప్రభుత్వాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.


ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Updated Date - Apr 02 , 2026 | 06:52 AM