పిల్లలకు సోషల్ మీడియాను అనుమతించే విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వినియోగానికి కనీస వయసును 15 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది.
ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందం ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజా ఒప్పందంతో.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి అణు దాడి ప్రమాదం తప్పిందన్న ట్రంప్.. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో జరిపిన సంభాషణను వెల్లడించారు.
కువైట్, బహ్రెయిన్‌పై ఇరాన్ మళ్లీ మిసైల్స్ ప్రయోగించడంతో గల్ఫ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ మిసైల్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ పాలనాతీరును తప్పుబట్టిన ట్రంప్.. ఏదో ఒక రోజు తప్పకుండా ఆయనతో సమావేశమవుతానని చెప్పారు.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తూనే ఉన్నాయి. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేపట్టింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి వచ్చాయి. శాంతి చర్చలు కొనసాగుతున్న దశలో ఇరు దేశాలు తాజాగా పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది.
ఇరాన్ యుద్ధంలో తాము ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చెబుతున్న బ్రిటన్, హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా మార్చేందుకు మాత్రం సిద్ధమవుతోంది. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ అమర్చిన మందుపాతరలను గుర్తించి, తొలగించడంలో సహాయపడటానికి ముందుకొచ్చింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ భూగర్భ స్థావరంలో తలదాచుకుంటున్నట్టు అమెరికా నిఘావర్గాలు సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. దీని ఫలితంగానే సమాచార మార్పిడికి అధిక సమయం పడుతోందని పేర్కొన్నాయి.
యూఏఈలోని అణువిద్యుత్ కేంద్రంపై దాడి జరగడాన్ని భారత్ తాజాగా ఖండించింది. పరిస్థితి ప్రమాదకరమైన మలుపు తిరుగుతోందని హెచ్చరించింది.