Share News

హోర్ముజ్‌లో మందుపాతరల వేట.. ప్రత్యేక నౌకను పంపిన బ్రిటన్..

ABN , Publish Date - May 28 , 2026 | 01:25 PM

ఇరాన్‌ యుద్ధంలో తాము ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చెబుతున్న బ్రిటన్, హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా మార్చేందుకు మాత్రం సిద్ధమవుతోంది. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ అమర్చిన మందుపాతరలను గుర్తించి, తొలగించడంలో సహాయపడటానికి ముందుకొచ్చింది.

హోర్ముజ్‌లో మందుపాతరల వేట.. ప్రత్యేక నౌకను పంపిన బ్రిటన్..
Royal Navy mission

ఇరాన్‌ యుద్ధంలో తాము ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చెబుతున్న బ్రిటన్, హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా మార్చేందుకు మాత్రం సిద్ధమవుతోంది. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ అమర్చిన మందుపాతరలను గుర్తించి, తొలగించడంలో సహాయపడటానికి ముందుకొచ్చింది. హోర్ముజ్ జలసంధికి ఒక ప్రత్యేక సైనిక నౌకను పంపింది (UK mine hunter ship).


బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఆర్‌ఎఫ్‌ఏ లైమ్ బే (RFA Lyme Bay) నౌక సహాయంతో హోర్ముజ్‌లోని సీ-మైన్స్‌ను తొలగించే ఆపరేషన్ మొదలుకాబోతోంది. ఈ నౌకను మైన్-హంటింగ్ డ్రోన్లు, అండర్‌వాటర్ సెన్సర్లు, క్లియరెన్స్ బృందాలతో అప్‌గ్రేడ్ చేసి హోర్ముజ్ వైపు పంపించారు. ఈ నౌక ప్రస్తుతం జిబ్రాల్టర్ నుంచి బయలుదేరి సూయజ్ కాలువ ద్వారా పర్షియన్ గల్ఫ్ వైపు ప్రయాణిస్తోంది. సోనార్, ధ్వని, అయస్కాంత సెన్సార్లను ఉపయోగించి మందుపాతరలను గుర్తించే సామర్థ్యం గల వ్యవస్థలను ఈ నౌక మోసుకెళ్తోంది (Hormuz crisis).


ఇరాన్ నుంచి దాడులను ఎదుర్కొంటున్న పశ్చిమాసియా దేశాలకు బ్రిటన్ ఇప్పటికే యుద్ధ విమానాలను, డ్రోన్ నిరోధక వ్యవస్థలను అందించింది (Gulf tensions). కాగా, వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత, వాణిజ్య నౌకలను రక్షించడం, హోర్ముజ్ జలసంధి నుంచి పేలుడు పదార్థాలను తొలగించడం లక్ష్యంగా ఒక పూర్తి రక్షణాత్మక కార్యక్రమానికి తాము సంయుక్తంగా నాయకత్వం వహిస్తామని యూకే, ఫ్రాన్స్ ఏప్రిల్‌లో ప్రకటించాయి.


ఇవి కూడా చదవండి..

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 28 , 2026 | 01:25 PM