స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 28 , 2026 | 06:33 AM
బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇటీవల పెరిగిన బంగారం ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. గురువారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇటీవల పెరిగిన బంగారం ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి (Gold and Silver Rates). ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవడంతో బంగారం, వెండి ధరలపై ప్రభావం పడుతోంది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,280గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,090గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,430గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,240గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,89,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,84,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,89,900గా, బెంగళూరులో రూ.2,85,100గా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికా మంత్రి సాహసం.. చేతిపై కాటేసిన పాము.. వీడియో వైరల్..
పాక్ మధ్యవర్తిత్వమే అతి పెద్ద సమస్య: అమెరికా సెనెటర్