ఇరాన్‌తో అలాంటి డీల్ ఉండనే ఉండదు: ట్రంప్
ABN , Publish Date - May 27 , 2026 | 10:29 PM
శుద్ధి చేసిన యూరేనియంను తమకు తిరిగిచ్చినందుకు ఆంక్షలు తొలగించేలా ఇరాన్‌తో డీల్ ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తేల్చి చెప్పారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: శుద్ధి చేసిన యూరేనియంను తమకు అప్పగించినందుకు బదులుగా ఆంక్షలను సడలించే డీల్‌ను ఇరాన్‌తో కుదుర్చుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఆంక్షల విషయంలో మాత్రం సడలింపు ఉండదని తేల్చి చెప్పారు. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు బుధవారం ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లేదు.. లేదు.. అలాంటిదేమీ ఉండదు. ఆంక్షలను సడలించే ప్రసక్తే లేదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ మాత్రం యూరేనియంను కచ్చితంగా తమకు అప్పగిస్తుందని కూడా అన్నారు.
ఇరాన్, యూఎస్ మధ్య ఇంతకాలంగా చర్చలు జరుగుతున్న యుద్ధ విరమణ దిశగా ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయితే, ఇరాన్ ప్రభుత్వం తెరపైకి మరో ప్రతిపాదన తెచ్చిందని స్థానిక మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. తమ దేశం చుట్టూ మోహరించిన సైన్యాన్ని అమెరికా వెనక్కు పిలిపించుకుంటే తాము 30 రోజుల్లో హోర్ముజ్‌లో పరిస్థితిని సాధారణ స్థితికి తెస్తామని ఇరాన్ ప్రతిపాదించినట్టు అక్కడి మీడియా పేర్కొంది. అయితే, ఇవన్నీ ఊహాజనిత కథనాలేనని శ్వేత సౌధం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇక కేబినెట్ మీటింగ్‌లో కూడా ఇరాన్ గురించి ట్రంప్ ప్రస్తావించారు. డీల్ కుదుర్చుకునేందుకు ఇరాన్ ఉత్సుకతతో ఉన్నప్పటికీ తమ అంచనాలను మాత్రం అందుకోలేదని చెప్పారు. మరోవైపు, ఇజ్రాయెల్‌తో దౌత్యసంబంధాలను బలపరుచుకోవాలని ఇస్లామిక్ దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ దిశగా అబ్రహాం అకార్డ్స్ ఒప్పందానికి అంగీకరించాలని కోరారు. పాక్‌కు కూడా ఇదే విషయం చెప్పడంతో దయాది దేశం ఇరకాటంలో పడిపోయింది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికా మంత్రి సాహసం.. చేతిపై కాటేసిన పాము.. వీడియో వైరల్..
పాక్ మధ్యవర్తిత్వమే అతి పెద్ద సమస్య: అమెరికా సెనెటర్