Share News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరంపై ఇరాన్ దాడులు..

ABN , Publish Date - May 28 , 2026 | 12:29 PM

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. తాజాగా అమెరికా నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరంపై ఇరాన్ దాడులు..
Iran targets US base

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. తాజాగా అమెరికా నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. ఈ ఘటనతో పశ్చిమాసియాలో యుద్ధ భయాలు మళ్లీ మొదలయ్యాయి (Iran targets US base).


ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న ఒక సైనిక నియంత్రణ కేంద్రంపై అమెరికా దాడి చేసింది. అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలకు ముప్పుగా భావించిన నాలుగు ఇరానియన్ డ్రోన్లను కూడా కూల్చివేసింది. ఈ దాడులు పూర్తిగా ఆత్మరక్షణ చర్యలు అని అమెరికా స్పష్టం చేసింది (US Iran war).


అమెరికా దాడులకు ప్రతీకారంగా ఆ దేశ ఎయిర్‌బేస్‌పై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది (IRGC retaliation). అయితే ఏ దేశంలోని స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించలేదు. ఇకపై జరిగే ప్రతి దాడికి మరింత కఠిన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. కాగా, తమ గగనతలంలోకి క్షిపణులు, డ్రోన్‌లు దూసుకొచ్చాయని, వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని కువైట్ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 28 , 2026 | 12:29 PM