గుడ్‌న్యూస్ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - May 28 , 2026 | 10:43 AM
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు పడిపోవడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో భారత మార్కెట్‌లో పసిడి ధరలు దిగివచ్చాయి. గురువారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు పడిపోవడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో భారత మార్కెట్‌లో పసిడి ధరలు దిగివచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. (Gold and Silver Rates).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,060గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.2230 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,050గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.2050 మేర తగ్గింది (Gold Rate live).
మరోవైపు వెండి ధరలు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి (Silver prices today). వెండి కిలోకు పదివేల రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,85,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,75,000గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,85,000గా, బెంగళూరులో రూ.2,75,000గా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..