Share News

సిద్ధరామయ్య రాజీనామా సస్పెన్స్.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్..

ABN , Publish Date - May 28 , 2026 | 09:40 AM

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ సూపర్ ట్విస్ట్ ఇచ్చారు.

సిద్ధరామయ్య రాజీనామా సస్పెన్స్.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్..
Siddaramaiah resignation

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. అత్యంత కీలక సమయంలో ఆయన బెంగళూరులో లేకపోవడం కర్ణాటక రాజకీయ పరిణామాలకు మరింత ఉత్కంఠను చేర్చింది (Siddaramaiah resignation).


సీఎం పదవికి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఉదయం 10.30 గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరింది. అయితే గవర్నర్ తన కుటుంబంతో కలిసి స్వస్థలమైన ముంబైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన ఎప్పుడు తిరిగి వస్తారనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన తిరుగు ప్రయాణానికి సంబంధించిన టికెట్ ఇంకా బుక్ అవలేదని సమాచారం (Karnataka Governor).


గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో కర్ణాటకలో నాయకత్వ మార్పు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది (Karnataka CM change). మరోవైపు గవర్నర్ అందుబాటులో లేనప్పటికీ సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. తన రాజీనామా పత్రాన్ని సిద్ధరామయ్య గవర్నర్ కార్యాలయంలో సమర్పిస్తారని తెలుస్తోంది. కాగా, రాజ్యసభ ఎంపీగా వెళ్లేందుకు సిద్ధరామయ్య ఇష్టపడడం లేదట. మరో రెండేళ్ల పాటు ఎమ్మెల్యేగానే కొనసాగాలని ఆయన భావిస్తున్నారట.


ఇవి కూడా చదవండి..

అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 28 , 2026 | 09:40 AM