అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ..
ABN , Publish Date - May 28 , 2026 | 06:54 AM
మహారాష్ట్రలో ఓ వరుడు చేసిన వినూత్న పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పెళ్లి సందర్భంగా అతిథులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడానికి బదులు, వారికి భారీ బీమా రక్షణ కల్పించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
మహారాష్ట్రలో ఓ వరుడు చేసిన వినూత్న పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పెళ్లి సందర్భంగా అతిథులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడానికి బదులు, వారికి భారీ బీమా రక్షణ కల్పించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 3.5 వేల మందికి పైగా గ్రామస్థులకు రూ.34.6 కోట్ల విలువైన బీమా కవరేజీ అందించాడు (Wedding gift villagers).
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బహదూర్‌పురకు చెందిన సిద్ధేశ్వర్, మంజూషల వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. పెళ్లికి హాజరైన అతిథులందరికీ వరుడి తల్లిదండ్రులు రిటర్న్ గిఫ్ట్‌గా ప్రమాద బీమా పత్రాలు అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష విలువైన ప్రమాద బీమా చేయించి సమాజంపై తమ బాధ్యతను చాటుకున్నారు (Viral wedding news).
మొత్తం 3,500 మంది గ్రామస్తులకు రూ.34.6 కోట్ల బీమా కవరేజీ అందేలా ఏర్పాట్లు చేశారు (Rs 34 crore insurance). పెళ్లి మండపంలోనే వీరందరికీ బీమా పత్రాలు ఇచ్చారు. సమాజానికి ఉపయోగపడే విధంగా, తన పెళ్లిని గుర్తుండిపోయేలా మార్చుకున్న వరుడిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికా మంత్రి సాహసం.. చేతిపై కాటేసిన పాము.. వీడియో వైరల్..
పాక్ మధ్యవర్తిత్వమే అతి పెద్ద సమస్య: అమెరికా సెనెటర్