Share News

15 ఏళ్లు దాటితేనే సోషల్ మీడియాకు అనుమతి.. యూఏఈ కీలక నిర్ణయం..

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:04 PM

పిల్లలకు సోషల్ మీడియాను అనుమతించే విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వినియోగానికి కనీస వయసును 15 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది.

15 ఏళ్లు దాటితేనే సోషల్ మీడియాకు అనుమతి.. యూఏఈ కీలక నిర్ణయం..
UAE social media age limit

ఇంటర్నెట్ డెస్క్: పిల్లలకు సోషల్ మీడియాను అనుమతించే విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వినియోగానికి కనీస వయసును 15 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనను అమలు చేసిన తొలి అరబ్ దేశంగా యూఏఈ నిలిచింది (UAE social media age limit).


కొత్త నిబంధనల ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను సృష్టించుకోవడం, నిర్వహించడం లేదా వాటిలో పోస్టులు చేయడం, కామెంట్లు పెట్టడం, గ్రూపుల్లో చేరడం వంటి కార్యకలాపాలు చేయలేరు. పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి రక్షించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని యూఏఈ ప్రభుత్వం తెలిపింది.


ఈ నిబంధనలు యూఏఈలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని సోషల్ మీడియా సంస్థలకు వర్తిస్తాయి. వయస్సు నిర్ధారణ కోసం డిజిటల్ ఐడీలు, ఏఐ ఆధారిత ధ్రువీకరణ వ్యవస్థలను ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. కేవలం వినియోగదారులు చెప్పే వయస్సును మాత్రమే ఆధారంగా తీసుకోవడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది (UAE child online safety).


ప్రపంచవ్యాప్తంగా పిల్లల మానసిక ఆరోగ్యం, సోషల్ మీడియా వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి (Social media minimum age 15). ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేసియా తదితర దేశాలు కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఈ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం


ఈపీఎఫ్‌ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..

Updated Date - Jun 18 , 2026 | 05:04 PM