Share News

ఈపీఎఫ్‌ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:27 PM

ఈపీఎఫ్‌ చందాదారులకు శుభవార్త. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని ఈ నెలలోనే జమ చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఈపీఎఫ్‌ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..
EPFO interest update

ఈపీఎఫ్‌ చందాదారులకు శుభవార్త. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని ఈ నెలలోనే జమ చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన 8.25 శాతం వడ్డీకి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది (EPFO interest update).


తాజా వడ్డీ రేటు గత ఆర్థిక సంవత్సరంతో సమానంగానే ఉండటం విశేషం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కూడా ఈపీఎఫ్‌ఓ 8.25 శాతం వడ్డీని కొనసాగించడం ఉద్యోగులకు ఊరటనిస్తోంది. ఈ నెలాఖరులోగా పీఎఫ్ ఖాతాలకు వడ్డీ జమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత కూడా వడ్డీ జమ కావడానికి చాలా సమయం పట్టేది. అయితే కొత్త ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసిన నేపథ్యంలో చందాదారుల ఖాతాల్లో వెంటనే నిధులు జమయ్యే అవకాశం కనిపిస్తోంది (EPF interest rate 2026).


ఈపీఎఫ్ నిల్వలపై ఆర్థిక సంవత్సరం మొదటి తేదీ నుంచి ఆ ఏడాది చివరి తేదీ వరకు ఏ నెలకు ఆ నెల వడ్డీని లెక్కిస్తారు (EPFO latest news). నెల నెలా లెక్కించినప్పటికీ మొత్తం వడ్డీని మాత్రం ఏడాది చివర్లోనే జమ చేస్తారు. ఒకవేళ విత్‌డ్రాలు ఉంటే ఆ మేరకు వడ్డీ తగ్గిపోతుంది. అలాగే నిలిచిపోయిన ఖాతాలకు కూడా ఈపీఎఫ్‌ఓ ఎలాంటి వడ్డీ చెల్లించదు.


ఇవీ చదవండి:

డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?

బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్

Updated Date - Jun 18 , 2026 | 03:35 PM