పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్లో మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సుమారు గంటన్నరపాటు ఫోన్ సంభాషణ జరిగింది. అమెరికాకు రష్యా నుంచి డీజిల్ సరఫరా, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం.
2009లో అమెరికాలోని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో దోషిగా తేలిన మాజీ ఆర్మీ మేజర్ నిదల్ హసన్‌కు మరణశిక్ష విధించడాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా సమర్థించారు.
రష్యా నుంచి డీజిల్ దిగుమతికి అమెరికా డీల్ కుదుర్చుకుంది. త్వరలో అమెరికాకు రష్యా డీజిల్‌ను ఎగుమతి చేయనుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. రష్యాతో డీజిల్ దిగుమతి కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.
తమ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించే ‘పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్’ (పెర్మ్) నుంచి అంతర్జాతీయ, భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలను సస్పెండ్ చేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్ ఖండించింది.
భారతీయ మూలాలు కలిగిన దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయ కోవిదురాలు నవనీతం పిళ్లైను (నవీ పిళ్లై) ప్రతిష్ఠాత్మక శాంతి నోబెల్ వరించింది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రచారం, పరిరక్షణకు అందించిన విశేష సేవలకుగాను 2026 సంవత్సరానికి ఆమెను ఈ అవార్డుకు నార్వే నోబెల్ కమిటీ ఎంపిక చేసింది.
2026 నోబెల్ శాంతి బహుమతి విజేత నవి పిళ్లైపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. తనకు ఆ పురస్కారం దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారతీయ మూలాలున్న దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ ‘నవీ’ పిళ్లైకి అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి పిళ్లైని వరించింది.
అమెరికాలో విదేశీ వర్కర్లను వెట్టిచాకిరీ చేసే సేవకులుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వర్ణించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిపుణుల వలసలతో ఇరు దేశాలకు లాభం కలుగుతోందన్న విషయం మర్చిపోవద్దని పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ వైపు విదేశీ ఉద్యోగులు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠిన వైఖరి అవలంబిస్తుండగా, ఆయన వ్యాపార సంస్థలకు మాత్రం తక్కువ వేతనాలకే విదేశీ కార్మికులను నియమించుకునేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.