Share News

రష్యా చమురు కొనబోమని భారత్‌ హామీ

ABN , Publish Date - Feb 16 , 2026 | 04:00 AM

రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌, అమెరికాల నుంచి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.

రష్యా చమురు కొనబోమని భారత్‌ హామీ

  • అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌, అమెరికాల నుంచి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. శనివారం ఒకే వేదికపై నుంచి రెండు దేశాల విదేశాంగ మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేశారు. మ్యూనిచ్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. రష్యా నుంచి అదనపు చమురును కొనబోమని భారత్‌ తమకు హామీ ఇచ్చిందని తెలిపారు. అదే కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మాట్లాడుతూ.. నిర్ణయాలు తీసుకోవటంలో భారత్‌కు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి ఉందని తెలిపారు. లభ్యత, ధర, రిస్క్‌లను బేరీజు వేసుకున్న తర్వాతే చమురు కంపెనీలు ఇంధన కొనుగోళ్లపై ముందుకెళ్తాయని తెలిపారు.

Updated Date - Feb 16 , 2026 | 04:00 AM