సూపర్.. సిమ్ కార్డుల నుంచి రూ. 27 లక్షల బంగారం తీశాడు..
ABN , Publish Date - Feb 15 , 2026 | 08:30 PM
పడేసిన సిమ్ కార్డుల నుంచి ఓ వ్యక్తి ఏకంగా రూ.27 లక్షల విలువ చేసే బంగారం తీశాడు. ఇందుకోసం అతడు చాలా కష్టపడ్డాడు. కష్టానికి తగిన ఫలితం దక్కింది..
బీజింగ్, ఫిబ్రవరి 15: బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది లక్ష రూపాయల దిగువన ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర.. ఇప్పుడు 1.50 లక్షలు రూపాయలు దాటింది. పేద, మధ్య తరగతి వాళ్లు బంగారం అన్న మాట వింటేనే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ వ్యక్తి పారేసిన సిమ్ కార్డుల నుంచి ఏకంగా రూ.27 లక్షల విలువ చేసే బంగారం బయటికి తీశాడు. ఇందుకోసం అతడు చాలా కష్టపడ్డాడు. కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతానికి చెందిన క్వియావో అనే వ్యక్తి చెత్తను సేకరించి అమ్ముతుంటాడు. ఎలక్ట్రానిక్ వేస్ట్‌లో బంగారం ఉంటుందని అతడు తెలుసుకున్నాడు. బంగారం కోసం పాత సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ చిప్స్‌ను సేకరించటం మొదలెట్టాడు. భారీ మొత్తంలో వేస్ట్ సేకరించిన తర్వాత.. వేస్ట్ నుంచి ఏకంగా 200 గ్రాముల బంగారం బయటకు తీశాడు. మార్కెట్‌లో ఆ బంగారం విలువ అక్షరాలా రూ.27 లక్షలు. ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి బంగారం తీయడానికి క్వియావో చాలా కష్టపడ్డాడు.
సాధారణంగా సిమ్ కార్డుల్లో అత్యంత తక్కువ బంగారం ఉంటుంది. ఒక్కో సిమ్ కార్డులో 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. 200 గ్రాముల బంగారం తీయడానికి అతడు ఏకంగా నాలుగు లక్షల సిమ్‌లను సేకరించాడు. క్వియావోకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ‘నాకు చిప్స్ నుంచి విలువైన లోహాలను వేరు చేయటం అంటే నాకు ఎంతో ఆసక్తి. నాలుగు లక్షల సిమ్ కార్డులను సేకరించి అత్యంత జాగ్రత్తగా వాటినుంచి బంగారం వేరు చేశా’ అని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
శివనామస్మరణతో మారుమోగుతున్న పుణ్యక్షేత్రాలు.. శివరాత్రి జాగరణ కోసం సకల ఏర్పాట్లు
బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు