Share News

ఆగండి.. మీ ఐడీ కార్డు చూపండి?

ABN , Publish Date - Feb 16 , 2026 | 04:04 AM

జర్మనీలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిం మునీర్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మ్యూనిక్‌ అంతర్జాతీయ భద్రత సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మునీర్‌కు ఊహించని షాక్‌ తగిలింది.

ఆగండి.. మీ ఐడీ కార్డు చూపండి?

  • మ్యూనిక్‌ సదస్సులో పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ఆపిన భద్రతా అధికారి

బెర్లిన్‌, ఫిబ్రవరి 15: జర్మనీలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిం మునీర్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మ్యూనిక్‌ అంతర్జాతీయ భద్రత సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మునీర్‌కు ఊహించని షాక్‌ తగిలింది. అక్కడి భద్రతా సిబ్బంది ఆయన్ను ఆపి... ఐడీ కార్డు చూపించాలని అడిగారు. మునీర్‌ వేదిక వద్దకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఓ మహిళా అధికారిణి.. ‘ఆగండి.. మీ ఐడీ కార్డు ఎక్కడ? కనిపించేలా ఉంచండి’ అంటూ మునీర్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చర్చనీయాంశమైంది. పాక్‌ మాజీ సైనికాధికారి అదిల్‌ రాజా స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై మునీర్‌ను ఎవరూ గుర్తించరని అన్నారు. గేట్‌ కీపర్లు ప్రశ్నించినా మునీర్‌ వినయంగా తనను తాను ఫీల్డ్‌ మార్షల్‌ అంటూ పరిచయం చేసుకుంటారని ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 16 , 2026 | 04:04 AM