Share News

ఉగ్రవాది పన్నున్‌ హత్యకు కుట్ర పన్నా నిఖిల్‌

ABN , Publish Date - Feb 15 , 2026 | 05:50 AM

ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ను హత్య చేయించేందుకు కుట్ర పన్నానని నిందితుడు నిఖిల్‌ గుప్తా (54) అంగీకరించాడు. అమెరికా భూభాగంలో...

ఉగ్రవాది పన్నున్‌ హత్యకు కుట్ర పన్నా నిఖిల్‌

న్యూయార్క్‌, ఫిబ్రవరి 14: ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ను హత్య చేయించేందుకు కుట్ర పన్నానని నిందితుడు నిఖిల్‌ గుప్తా (54) అంగీకరించాడు. అమెరికా భూభాగంలో పన్నున్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న కేసుపై శుక్రవారం న్యూయార్క్‌ కోర్టులో విచారణ జరిగింది. పన్నున్‌ను హత్య చేసేందుకు భారత జాతీయుడైన నిఖిల్‌ గుప్తా సహ నిందితుడైన వికాస్‌ యాదవ్‌తో కలిసి కుట్ర పన్నినట్టు ప్రభుత్వ అటార్నీ ఆరోపించారు. ఇందుకు లక్ష డాలర్లు చెల్లించేందుకు ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని, 15వేల డాలర్లు బయానాగా చెల్లించినట్టు వివరించారు. ఈ ఆరోపణను నిందితుడు నిఖిల్‌ గుప్తా అంగీకరించాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపు ఎవరిదంటే..

Updated Date - Feb 15 , 2026 | 05:50 AM