రష్యా ట్యాంకర్లపై దాడి జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాంకర్లపై దాడి జరిగిన వెంటనే అందులోని సిబ్బంది 'డ్రోన్ దాడి' అంటూ చెప్పడం వీడియోలో కనిపిస్తోంది.
శ్రీలంకలో మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. గతంలో ఆర్థిక మాంద్యం కారణంగా ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా దిత్వా తుఫాన్ కారణంగా అత్యవరస పరిస్థితిని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రధాన కార్యనిర్వాహక అధికారి యెర్మాక్ విధుల నుంచి తొలగిపోయారు. కొన్నేళ్లుగా ఆయనతో సన్నిహిత సంబంధాలున్న జెలెన్‌స్కీకి.. రష్యాతో యుద్ధ విరమణ నేపథ్యంలో ఇలా జరగడంతో తీవ్ర తలనొప్పిగా మారినట్టైంది.
ఎయిర్‌బస్ ఏ320 విమానాల్లో సాంకేతిక లోపం బయటపడింది. సమస్యను చక్కదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 6000 విమానాల్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లకు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా రాబోయే రోజుల్లో పలు విమానయాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ ఏ320 విమానాల సర్వీసులను రద్దు చేశాయి.
ఇమ్రాన్ ఖాన్‌కు హాని జరిగితే పాక్ అల్లకల్లోలంగా మారుతుందని ఆయన సోదరి నోరీన్ నియాజీ హెచ్చరించారు. పాక్ ప్రజల మద్దతు ఇమ్రాన్‌కు ఉందని అన్నారు. ఆయన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని అన్నారు.
ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన మూడో ప్రపంచ దేశాల పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు...
యూకే ప్రభుత్వ కఠిన నిబంధనల కారణంగా దేశంలోకి నికర వలసలు భారీగా తగ్గాయి. 2025 జూన్‌తో ముగిసిన ఏడాది కాలంలో నికరంగా వలసొచ్చిన వారి సంఖ్య కేవలం 204,000. 2023తో పోలిస్తే ఇది ఏకంగా 80 శాతం తక్కువ
శ్రీలంకను భారీ వర్షాలు, వరదలు ఊపిరిసలపనివ్వడంలేదు. జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. పాఠశాలలు, కార్యాలయాలు మూసివేశారు. వరుస ప్రమాద హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇప్పటి వరకూ 56 మంది ప్రాణాలు కోల్పోయారు.
మీకు ఫలానా తేదీన ఇంటర్వూ ఉంది రండి.. అంటూ పిలుస్తున్నారు. తీరా వచ్చిన తర్వాత ఏమాత్రం తేడాగా కనిపించినా అరెస్ట్ చేస్తున్నారు. ఈ వింత వ్యవహారం ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్లు..
అమెరికాకు చెందిన నేషనల్ గార్డ్స్ ఉమెన్.. 20 ఏళ్ల సారా బెక్‌స్ట్రోమ్ చివరికి ప్రాణాలొదిలింది. వైట్ హౌస్ సమీపంలో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సైనికుల్లో సారా ఒకరు. మరో సైనికుడు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.