Share News

బ్రిటన్‌ మాజీ యువరాజు ఆండ్రూ విడుదల

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:18 AM

బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటన్‌ విండ్సర్‌ను పోలీసులు విడుదల చేశారు. అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు బ్రిటన్‌ రహస్య పత్రాలను...

బ్రిటన్‌ మాజీ యువరాజు ఆండ్రూ విడుదల

  • 11 గంటలపాటు పోలీస్‌ కస్టడీలో

లండన్‌, ఫిబ్రవరి 20: బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటన్‌ విండ్సర్‌ను పోలీసులు విడుదల చేశారు. అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు బ్రిటన్‌ రహస్య పత్రాలను చేరవేయటంతోపాటు తన కార్యాలయాన్ని అసాంఘిక వ్యవహారాలకోసంవినియోగించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలపై ఆండ్రూను థేమ్స్‌వ్యాలీ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 11 గంటలపాటు ఆయనను తమ అదుపులోనే ఉంచుకున్న పోలీసులు.. గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఆండ్రూపై దర్యాప్తు కొనసాగుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆండ్రూకు చెందిన నార్‌ఫోక్‌ ఎస్టేట్‌లో సోదాలు పూర్తయ్యాయని, బెర్క్‌షైర్‌లోని కోటలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా, ఎప్‌స్టీన్‌, ఆండ్రూ దారుణాలపై బ్రిటన్‌ మీడియా రోజుకో కొత్త సంచలనాన్ని బయటపెడుతోంది. బ్రిటన్‌లోని ఫ్రాగ్మోర్‌ కాలేజీలో ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయసున్న ఓ బాలికను ఎప్‌స్టీన్‌ బంధించి ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇస్తుంటే ఆండ్రూ పక్కనే ఉన్నాడని తాజాగా బయటపెట్టింది.

Updated Date - Feb 21 , 2026 | 12:18 AM