ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీపై కృషి చేసినందుకు, అత్యంత శక్తిమంతమైన ఖగోళ న్యూట్రినోలను గుర్తించినందుకు శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు నోబెల్ బహుమతి లభించింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య, యూఎస్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ హెలికాప్టర్ దిగుతూ తూలిపడబోయి మళ్లీ నిలదొక్కుకున్నారు.
డ్రోన్ దాడుల ముప్పు పెరగడంతో పాకిస్థాన్ సైన్యం వినూత్న రక్షణ మార్గాన్ని ఎంచుకుంది. సున్నిత ప్రాంతాల్లో ఆర్మీ, పోలీస్ చెక్పోస్టులపై చేపల వలలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
ఒమనీ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ చేతిలో తీవ్రంగా గాయపడి విమానం కూలకుండా కాపాడిన ఫ్లైదుబాయ్ విమానం హీరో, భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ పుర్రెకు ఫ్రాక్చర్ ఏర్పడిందని డాక్టర్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా యూఏఈలోని అబుదాబిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సాధారణంగా పొద్దున్నైతే చాలు. పిల్లలను స్కూలుకు పంపడంలో పేరెంట్స్ తీరిక లేకుండా ఉంటారు. పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ సిద్ధం చేస్తూ బిజీగా గడుపుతుంటారు. మెడిసిన్‌లో నోబెల్ బహుమతికి ఎంపికైన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్ల్ డీసెరోథ్ కూడా సోమవారం ఉదయం అలాగే బిజీగా ఉన్నారు. ఉన్నట్టుండి ఓ వార్త ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.
చట్టాలను ఉల్లంఘించిన వారి పౌరసత్వ రద్దు కోసం అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలకు దిగింది.
అమెరికా ఆంక్షలతో ఇరాన్ చమురు ఎగుమతులు ఒత్తిడికి గురవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ చమురు మంత్రి మోహ్సేన్ పాక్నెజాద్ రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో NIOC చీఫ్‌ను తాత్కాలిక మంత్రిగా నియమించారు.
సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయం, రబిఘ్లోని ఆరామ్కో రిఫైనరీతో పాటు పలు కీలక సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. ఈ దాడులను సౌదీ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.
ఫ్లైదుబాయ్ విమానం ఉదంతానికి సంబంధించి అమెరికా మీడియాలో మరో సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. టెల్ అవీవ్ వైపుగా వస్తున్న విమానాన్ని కూల్చేద్దామని ఇజ్రాయెల్ ఒకానొక దశలో భావించినట్టు తెలిసింది.
ఫ్లైదుబాయ్ విమానం ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ చేసిన ఉగ్రదాడి వెనుక ఇరాన్ హస్తం ఉండవచ్చని ట్రంప్ ఆరోపించారు.