ప్రపంచంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం.. పున:ప్రారంభించిన జపాన్..
ABN , Publish Date - Feb 10 , 2026 | 07:14 AM
గతంలో సాంకేతిక లోపం వల్ల నిలిచిపోయిన కాషివాజాకి-కరీవా ప్లాంట్‌ను జపాన్ సోమవారం పున:ప్రారంభించింది. కాషివాజాకి-కరీవా ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం. 2011లో జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం, సునామీ కారణంగా పుకుషిమా ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది.
గతంలో సాంకేతిక లోపం వల్ల నిలిచిపోయిన కాషివాజాకి-కరీవా ప్లాంట్‌ను జపాన్ సోమవారం పున:ప్రారంభించింది. కాషివాజాకి-కరీవా ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రం. 2011లో జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం, సునామీ కారణంగా పుకుషిమా ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం వల్ల దేశవ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాలను నిలిపివేయాలని జపాన్ నిర్ణయించుకుంది. దీంతో కాషివాజాకి-కరీవా ప్లాంట్ మూతబడింది (Japan nuclear plant restart).
శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని జపాన్ ప్రభుత్వం ఇటీవల భావించడం, 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అవసరాల నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడం వంటి కారణాలతో అణు విద్యుత్ కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కాషివాజాకి-కరీవా ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించడానికి జనవరిలో అధికారులు ప్రయత్నించారు. అయితే అప్పుడు మానిటరింగ్ అలారం మోగడంతో ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు (world’s biggest nuclear power plant).
అవసరమైన మరమ్మత్తులు చేసి కాషివాజాకి-కరీవా ప్లాంట్‌లోని ఒక రియాక్టర్‌ను సోమవారం ప్రారంభించారు (nuclear power restart Japan). వచ్చే నెలలో మొత్తం తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్‌లో కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నట్టు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ తెలిపింది. ఈ ప్లాంట్‌లో మొత్తం ఏడు రియాక్టర్లు ఉన్నాయి.
Also Read:
ఖర్చుకు వెనకాడని యూఎస్ కంపెనీలు! హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రెండు కొత్త వాల్యూ-బేస్డ్ ఫండ్స్