పాక్‌లో ఉన్న భావన కలుగుతోంది డాలస్.. టెక్సా్‌సల్లో ఉన్నట్లు కాదు
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:36 AM
టెక్సాస్, డాల్‌సల్లోని కొన్ని ప్రాంతాల ‘ఇస్లామీకరణ’ పట్ల అమెరికా కాం గ్రెస్ సభ్యుడు బ్రాడన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడన్ గిల్
న్యూయార్క్, ఫిబ్రవరి 8: టెక్సాస్, డాల్‌సల్లోని కొన్ని ప్రాంతాల ‘ఇస్లామీకరణ’ పట్ల అమెరికా కాం గ్రెస్ సభ్యుడు బ్రాడన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ రెండు ప్రాంతాల్లోని స్థానిక షాపింగ్ మాల్స్‌కెళితే.. మీరు పాకిస్తాన్‌లో ఉన్న భావన కలుగుతుంది. డాల్‌సలో ఉన్నట్లు కాదు’ అని వ్యాఖ్యానించారు. రియల్ అమెరికా వాయి్‌సకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడన్ గిల్ మాట్లాడుతూ.. ‘డాలస్ అంతా ఇస్లామీకరణ కావడం తీవ్ర ఆందోళనకరం’ అని చెప్పారు. ‘మా చుట్టూ మసీదులు పెరిగిపోతున్నాయి. మా సమాజాలు పూర్తిగా పరివర్తన చెందాయి. మా వాళ్లు స్థానిక షాపింగ్ మాల్స్‌కెళితే.. పాకిస్తాన్‌లో ఉన్న భావన కలుగుతోంది కానీ డాలస్, టెక్సా్‌సలలో ఉన్నట్లు కాదు. ఇదొక సమస్య’ అన్నారు.