రోబోల కుంగ్‌ఫూ
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:35 AM
రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన రోబో సినిమా గుర్తుందా.. అందులో వశీకర్ అభివృద్ధి చేసిన హ్యుమనాయిడ్ రోబో చిట్టి అన్ని రకాల కళలలోనూ ప్రావీణ్యం చూపిస్తుంది.
చైనా షావోలిన్ టెంపుల్‌లో సన్యాసులతో కలిసి రోబోల సాధన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన రోబో సినిమా గుర్తుందా.. అందులో వశీకర్ అభివృద్ధి చేసిన హ్యుమనాయిడ్ రోబో చిట్టి అన్ని రకాల కళలలోనూ ప్రావీణ్యం చూపిస్తుంది. వంట, సంగీతం, నాట్యంతోపాటు యుద్ధకళలను కూడా ప్రదర్శిస్తుంది. కృత్రిమ మేధ(ఏఐ) పుణ్యమాని రోబో సినిమాలో లాంటి చిట్టీలు నిజ జీవితంలోకి రానున్నాయి. చైనాలోని రోబోలు ఇప్పుడు యుద్ధ కళలను నేర్చుకుంటున్నాయి. చైనాలోని షావోలిన్ టెంపుల్‌లో అక్కడి సన్యాసులతో కలిసి రోబోలు కుంగ్‌ఫూ సాధన చేస్తున్నాయి. కుంగ్‌ఫూ సాధనలో భాగంగా షావోలిన్ సన్యాసులు చేస్తున్న విన్యాశాలను చూసి యధాతథంగా చేసేస్తున్నాయి. ఏఐ ఆధారిత హ్యుమనాయిడ్ మెషీన్‌లను అభివృద్ధి చేసే షాంఘైకు చెందిన ఏగీబాట్ అనే సంస్థ ఈ రోబోలను రూపొందించింది.