ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌కు చెందిన అత్యాధునిక మోడల్స్ ఇతర దేశాలకు అందకుండా అమెరికా నిషేధించడంపై ఐరోపాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీ అంతరిక్ష పరిశోధన శాఖ మంత్రి డొరొతీ బార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు ఐరోపా, జర్మనీ అందించే సాంకేతికతలు కీలకమని గుర్తు చేశారు.
భారత్-ఈయూ దేశాల మధ్య ఎఫ్‌టీఏపై ఈ ఏడాది డిసెంబర్ నాటికి సంతకాలు పూర్తయ్యే అవకాశమున్నట్టు కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని కూడా ఆయన తెలిపారు.
ప్రధాని మోదీపై జాత్యహంకార పూరిత కార్టూన్‌తో ఒక వ్యాసాన్ని ప్రచురించిన నార్వే పత్రికపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్‌లో ప్రజాస్వామ్యం, మైనారిటీ హక్కులపై డచ్ ప్రధాని వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అవగాహన రాహిత్యం కారణంగా భారత్‌పై సందేహాలు వస్తుంటాయని చెప్పింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భార్య బ్రిజిట్టే ఆయనను చెంప ఛెళ్లుమనిపించినట్టు జర్నలిస్టు ఫ్లోరియన్ తన పుస్తకంలో రాసుకున్నారు. పుసక్తంలోని కొన్ని వివరాలను ఫ్రాన్స్ మీడియా ప్రచురించింది.
నెదర్లాండ్స్‌లో డచ్ రాజ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని పన్నిన భయానక కుట్రలో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సింహాసన వారసురాలు క్యాథరీనా అమాలియా, ఆమె చెల్లెలు యువరాణి అలెక్సియాలను హత్య చేసేందుకు ఓ వ్యక్తి ప్రణాళిక రచించాడు.
రష్యాకు చెందిన సైనిక రవాణా విమానం ఏఎన్-26 ప్రమాదానికి గురైంది. క్రిమియాలో కొండను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.
మొన్నటి వరకు సాధారణ వార్ డ్రోన్స్, మిస్సైల్స్ వాడిన ఇరాన్ ఇప్పుడు డోస్ పెంచింది. ఏకంగా బాలిస్టిక్ మిస్సైల్స్ క్యారీయింగ్ క్లస్టర్ మూనిషన్స్‌ను రంగంలోకి దించింది.
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరైనా.. అతడు తమ నెక్స్ట్ టార్గెట్ అని తేల్చి చెప్పారు.
ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మొజ్తాబాను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నిక చేశారని సమాచారం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేని మొజ్తాబా ఒక్కసారిగా సుప్రీం లీడర్‌గా ఎన్నికవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.