ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మా టార్గెట్.. వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:57 PM
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరైనా.. అతడు తమ నెక్స్ట్ టార్గెట్ అని తేల్చి చెప్పారు.
ఇంటర్‌నెట్ డెస్క్: దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో ఆయన రెండవ కుమారుడు మొజ్తాబా హుస్సేన్ ఖమేనీ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యాడంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెవల్యూషనరీ గార్డ్స్ అండదండలతో మొజ్తాబా కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారని సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన పలు మీడియా సంస్థలు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా అంటూ వార్తలు సైతం ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరైనా.. అతడు తమ నెక్స్ట్ టార్గెట్ అని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఇజ్రాయెల్‌ను నాశనం చేసే ప్రణాళికను కొనసాగించడానికి.. చుట్టు పక్కల ఉండే దేశాలను బెదిరించడానికి.. ఇరాన్ ప్రజలను అణిచివేయడానికి.. ఇరాన్ ఉగ్రవాద పాలన ద్వారా నియమించబడే ఏ నాయకుడైనా సరే.. అతను ఖచ్చితంగా మా నెక్స్ట్ టార్గెట్. అతని పేరు ఏదైనా.. ఎక్కడ దాక్కున్నా సరే వదిలిపెట్టం’ అని స్పష్టం చేశారు.
ఐఏఈఏ అధినేత రాఫెల్ గ్రోసీ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేస్తోందన్న ట్రంప్ ప్రభుత్వ వ్యాఖ్యలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ( ఐఏఈఏ) రాఫెల్ గ్రోసీ ఖండించారు. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఇరాన్ దగ్గర అణుబాంబు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందనడానికి ఆధారాలు కూడా లేవన్నారు. ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం రైనోలను 10 సెకెన్లలో గుర్తించండి..
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి జరిమానా.. ఎందుకంటే...