Share News

ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన భార్య.. మీడియాలో కథనాలు

ABN , Publish Date - May 14 , 2026 | 12:59 PM

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భార్య బ్రిజిట్టే ఆయనను చెంప ఛెళ్లుమనిపించినట్టు జర్నలిస్టు ఫ్లోరియన్ తన పుస్తకంలో రాసుకున్నారు. పుసక్తంలోని కొన్ని వివరాలను ఫ్రాన్స్ మీడియా ప్రచురించింది.

ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన భార్య..  మీడియాలో కథనాలు
Emmanuel Macron, Brigitte Macron, Iranian Actress Golshifteh Farahani

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ను ఆయన భార్య బ్రిజిట్టే చెంప ఛెళ్లుమనిపించినట్టు జర్నలిస్టు ఫ్లోరియన్ టార్డిఫ్ తన కొత్త పుస్తకంలో పేర్కొన్నారు. గతేడాది విదేశీ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. ఇరాన్ నటి గోల్షిఫ్తే ఫర్హానీ, మెక్రాన్‌ల చాటింగ్‌ను ఫోన్‌లో చూసిన బ్రిజిట్టే భర్తపై అగ్గిమీద గుగ్గిలమైనట్టు ఫ్లోరియన్ తన పుసక్తం ‘యాన్ (ఆల్‌మోస్టు) పర్‌ఫెక్ట్ కపుల్’‌లో రాశారు. పుస్తకంలోని కొన్ని భాగాలను ఫ్రాన్స్ మీడియా కూడా ప్రచురించింది.

Macron.jpg

వియత్నాం పర్యటన సందర్భంగా గతేడాది మెక్రాన్ దంపతుల వీడియో ఒకటి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. హనోయ్‌లో ల్యాండయ్యాక విమానం దిగే ముందు బ్రిజిట్టే తన భర్తను ముఖం పట్టి వెనక్కు నెట్టినట్టు ఆ వీడియోలో కనిపించింది. అప్పట్లో ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ ఘటనను చిన్న విషయంగా కొట్టిపారేశారు. అయితే, ఈ ఘటనకు మునుపే మరో సందర్భంలో బ్రిజిట్టే భర్త చెంప ఛెళ్లుమనిపించినట్టు ఫ్లోరియన్ తన పుస్తకంలో పేర్కొన్నారు.


Macron 2.jpg

మీరు ఆకర్షణీయంగా ఉంటారంటూ మెక్రాన్ ఇరాన్ నటికి మెసేజీ పెట్టినట్టు పుస్తకంలో ఉందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ నటి, మెక్రాన్ మధ్య కొన్ని నెలల పాటు ప్లెటోనిక్ బంధం కొనసాగినట్టు ఫ్లోరియన్ తెలిపారు. వాస్తవాల ఆధారంగా తాను ఈ పుస్తకాన్ని రాశానని కూడా మీడియాకు స్పష్టం చేశారు. అయితే, బ్రిజిట్టే ప్రతినిధులు మాత్రం ఈ కథనాలను కొట్టిపారేశారు. ఆమె తన భర్త ఫోన్‌ను ఎన్నడూ చెక్ చేయరని కూడా అన్నారు. మరోవైపు ఇరాన్ నటి ఫర్హానీ కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. తమ జీవితంలో ప్రేమ లేని వారే ఇలాంటి వార్తలను వ్యాపిస్తున్నారని మండిపడ్డారు.

ఇక వియత్నాం ఘటనపై అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. బ్రిజిట్టే భర్తతో సరిగా వ్యవహరించరని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎవరికీ తెలీకుండా ఉండేందుకు తలుపు వేసుకుంటే మంచిదని కూడా మెక్రాన్‌కు సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

చైనా అధినేతతో శిఖరాగ్ర సమావేశం.. జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు

హోర్ముజ్‌ను దాటిన మరో ఎల్‌పీజీ ట్యాంకర్.. త్వరలో భారత్‌కు..

Updated Date - May 14 , 2026 | 01:49 PM