• Home » Elections » bihar assembly elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

Bihar Elections: నితీష్ రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లో ఉంది: రాహుల్

Bihar Elections: నితీష్ రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లో ఉంది: రాహుల్

బిహార్‌లో సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం లేవని, కేవలం ముగ్గురు నలుగురు బీజేపీ నేతలు రిమోట్ కంట్రోల్‌ను తమ చేతుల్లో పెట్టుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Bihar Elections: పీఎం, సీఎం సీట్లు ఖాళీగా లేవు.. అమిత్‌షా

Bihar Elections: పీఎం, సీఎం సీట్లు ఖాళీగా లేవు.. అమిత్‌షా

బిహార్ ప్రతిష్టను పెంచేందుకు ప్రధానమంత్రి చేస్తున్న కృషిని అమిత్‌షా ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ను భారతరత్నతో గౌరవించారని అన్నారు. దేశ ప్రజాస్వామిక, సామాజిక వృద్ధిలో బిహార్ కృషికి ఇది సరైన గుర్తింపని అన్నారు.

Bihar Assembly Elections: ఒక ముస్లిం ముఖ్యమంత్రి కాకూడదా.. బిహార్‌లో ఒవైసీ ప్రచారం షురూ

Bihar Assembly Elections: ఒక ముస్లిం ముఖ్యమంత్రి కాకూడదా.. బిహార్‌లో ఒవైసీ ప్రచారం షురూ

బీజేపీపై మైనారిటీల్లో ఉన్న భయాన్ని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు ముస్లిం ఓట్లకు గాలం వేస్తున్నాయని, అయితే ఈ పార్టీలు బీజేపీని అడ్డుకోలేవని ఒవైసీ అన్నారు.

Bihar Elections: తప్పుడు ఉద్యోగ వాగ్దానాలతో యువతను ఫూల్స్ చేస్తున్నారు: నితీష్ మండిపాటు

Bihar Elections: తప్పుడు ఉద్యోగ వాగ్దానాలతో యువతను ఫూల్స్ చేస్తున్నారు: నితీష్ మండిపాటు

బిహార్‌లో 2005కు ముందు నిరక్షరాస్యత, నిరుద్యోగత, వలసలు ఉండేవని, ఉన్నత విద్య కోసం ఒక్క మంచి విద్యాసంస్థ కూడా ఉండేది కాదని, యువత చీకట్లో మగ్గేదని నితీష్ తెలిపారు. యువకులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అవమానాలు పాలయ్యేవారని చెప్పారు.

Bihar Assembly Elctions 2025: మహాగట్‌బంధన్ మేనిఫెస్టో విడుదల

Bihar Assembly Elctions 2025: మహాగట్‌బంధన్ మేనిఫెస్టో విడుదల

రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది. మేనిఫెస్టో మొదట్లోనే ఈ హామీ చోటుచేసుకుంది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది.

Bihar Elections: 27 మంది రెబల్స్‌పై ఆర్జేడీ వేటు

Bihar Elections: 27 మంది రెబల్స్‌పై ఆర్జేడీ వేటు

వివిధ నియోజకవర్గాల్లో పలువురు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండటం, పార్టీ నామినీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు వస్తున్న వార్తలతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్టు ఆర్జేడీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Bihar Elections: మేము గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తాం.. తేజస్వి సంచలన వ్యాఖ్యలు

Bihar Elections: మేము గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తాం.. తేజస్వి సంచలన వ్యాఖ్యలు

నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్ర యంత్రాంగం అవినీతిమయమైందని, శాంతిభద్రతలు లోపించాయని తేజస్వి ఆరోపించారు. సీమాంచల్ ప్రాంతాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.

Bihar Elections: 40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా

Bihar Elections: 40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా

స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ వంటి ప్రముఖులు ఉన్నారు. సచిన్ పైలట్, భూపేష్ బఘేల్, గౌరవ్ గొగోయ్, కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవాని, దిగ్విజయ్ సింగ్, రణ్‌జీత్ రంజన్, తారిఖ్ అన్వర్ తదితరులు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నారు.

Bihar Elections: 16 మంది నేతలను పార్టీ నుంచి బహిష్కరించిన నితీష్

Bihar Elections: 16 మంది నేతలను పార్టీ నుంచి బహిష్కరించిన నితీష్

పార్టీ అధికార ప్రకటన ప్రకారం, బహిష్కరణ వేటు పడిన నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, మాజీ మంత్రి శైలేష్ కమార్, మాజీ ఎమ్మెల్సీ సంజయ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Bihar Elecitons: మాకు ఓటేస్తే ఉపాధి కోసం బిహార్ వదలి వెళ్లక్కర్లేదు.. ప్రశాంత్ కిషోర్ భరోసా

Bihar Elecitons: మాకు ఓటేస్తే ఉపాధి కోసం బిహార్ వదలి వెళ్లక్కర్లేదు.. ప్రశాంత్ కిషోర్ భరోసా

సీతామర్హిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, ఇది జన్‌ సురాజ్ జన్మభూమి అని, మూడేన్నరేళ్ల క్రితం పార్టీ పుట్టిందని చెప్పారు. భయంతో బీజేపీకో, లాలూకో ఓటు వేయాల్సిన పనిలేదని, బిహార్‌లో రాజకీయ వెట్టిచాకిరీకి తాము ముగింపు పలకాలని తమ పార్టీ గట్టిగా తీర్మానించుకుందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి