Bihar Elections: పీఎం, సీఎం సీట్లు ఖాళీగా లేవు.. అమిత్‌షా
ABN , Publish Date - Oct 29 , 2025 | 02:44 PM
బిహార్ ప్రతిష్టను పెంచేందుకు ప్రధానమంత్రి చేస్తున్న కృషిని అమిత్‌షా ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ను భారతరత్నతో గౌరవించారని అన్నారు. దేశ ప్రజాస్వామిక, సామాజిక వృద్ధిలో బిహార్ కృషికి ఇది సరైన గుర్తింపని అన్నారు.
దర్బంగా: నాయకత్వం చేపట్టాలనే విపక్షాల ఆకాంక్షలను, ఎన్డీయే సీఎం అభ్యర్థి వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తిప్పికొట్టారు. పీఎం సీటు కానీ సీఎం సీటు కానీ ఖాళీగా లేవని అన్నారు. 'ఇక్కడ నితీష్ కుమార్ ఉన్నారు, అక్కడ పీఎం మోదీ ఉన్నారు' అంటూ ఛలోక్తి విసిరారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్బంగాలో బుధవారం జరిగిన సభలో అమిత్‌షా మాట్లాడుతూ, బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఇక్కడ కొనసాగుతారని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా కొనసాగుతారని చెప్పారు.
బిహార్ ప్రతిష్టను పెంచేందుకు ప్రధానమంత్రి చేస్తున్న కృషిని అమిత్‌షా ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌ను భారతరత్నతో గౌరవించారని అన్నారు. దేశ ప్రజాస్వామిక, సామాజిక వృద్ధిలో బిహార్ కృషికి ఇది సరైన గుర్తింపని అన్నారు. మోదీ, నితీష్ నాయకత్వంలో బిహార్ అభివృద్ధి, సుపరిపాలన తారాస్థాయికి చేరుకున్నాయని, సంపూర్ణ అభివృద్ధి దిశగా శీఘ్రగతిని బిహార్ పురోగమిస్తోందని చెప్పారు. ఆర్జేడీ హయాంలో ఆటవిక రాజ్యం బిహార్‌ను ఏలిందని, ఎన్డీయే హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి భద్రతలను తిరిగి తీసుకువచ్చామని చెప్పారు. భయం, అవినీతి రాజ్యమేలే ఆర్జేడీ పాలనను తిరిగి రాష్ట్రంలో తీసుకురావద్దని, దర్బంగా బీజేపీ అభ్యర్థి మైథిలి ఠాకూర్‌ను గెలిపించాలని కోరారు.
దర్బంగాకు మెట్రో ప్రాజెక్టును తెస్తున్నామని, పీఎఫ్ఐపై నిషేధం కొనసాగుతుందని, మైథిలితో రామ్‌సర్క్యూట్‌ను అనుసంధానిస్తూ సీతాదేవి ఆలయం నిర్మిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. వెనుకబడిన, అణగారిన వర్గాలకు న్యాయం జరగాలనే కర్పూరి ఠాకూర్ కలలను బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
తేల్చి చెప్పిన డీసీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...
కొత్త టోపీలు సూచించింది నేనే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి