TVK Vijay: డీఎంకేను ఇంటికి సాగనంపడం ఖాయం..
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:11 AM
వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటల్లో కంకులు మొలకెత్తినట్లే, రాష్ట్ర ప్రజల్లో డీఎంకే పాలనపై తీవ్ర వ్యతిరేకత మొలకెత్తి, పెరిగి పెద్దదై పాలకులను ఇంటికి సాగనంపటం ఖాయమైపోయిందని ‘తమిళగ వెట్రి కళగం’ నాయకుడు విజయ్ జోస్యం చెప్పారు.
- టీవీకే నేత విజయ్
చెన్నై: వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటల్లో కంకులు మొలకెత్తినట్లే, రాష్ట్ర ప్రజల్లో డీఎంకే పాలనపై తీవ్ర వ్యతిరేకత మొలకెత్తి, పెరిగి పెద్దదై పాలకులను ఇంటికి సాగనంపటం ఖాయమైపోయిందని ‘తమిళగ వెట్రి కళగం’ నాయకుడు విజయ్(Vijay) జోస్యం చెప్పారు. కరూర్ దుర్ఘటన జరిగిన నెల రోజుల తర్వాత విజయ్ వర్షాలకు పంటలను నష్టపోతున్న రైతులను ఆదుకోవటంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెప్టెంబరు 27 రాత్రి కరూర్(Karoor)లో రోడ్‌షో సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందటంతో విజయ్ చెన్నైలోని తన ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తడిసిన దాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా డీఎంకే ప్రభుత్వం రైతులను తీవ్ర నష్టాలకు గురిచేసిందని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం రైతులపట్ల నిజంగా శ్రద్ధ వహించేది అయితే, రైతుల జీవనోపాధి కాపాడి, ఆర్థికంగా ఎదగటానికి అవసరమైన చర్యలు చేపట్టి ఉండేదని, అయితే దాన్యం సకాలంలో కొనుగోలు చేయకుండా, వర్షం నీటిలో తడిసి వృథా అయ్యేలా చేసి ప్రభుత్వం రైతుల కడుపుకొట్టిందని విజయ్ విమర్శించారు.

తాను డెల్టా రైతు కుటుంబానికి చెందినవాడినంటూ గొప్పలు చెప్పుకుంటున్న స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. డెల్టా రైతుల శ్రమించి పండించిన వరిధాన్యాలను సకాలంలో గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు చేయకపోవడానికి కారణమేమిటి? రుతుపవన వర్షాల వల్ల పంటలు నష్టపోకుండా డీఎంకే ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమిటని ప్రశ్నించారు. కొద్ది రోజులుగా కురిసిన వర్షం కారణంగా తడిసి వరి వృధా కావటానికి, వాటిని పండించిన రైతుల ఆవేదనకు స్టాలిన్ ప్రభుత్వం సమాధానాలు చెప్పగలదా అని విజయ్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News