Bihar Elections: 27 మంది రెబల్స్‌పై ఆర్జేడీ వేటు
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:57 PM
వివిధ నియోజకవర్గాల్లో పలువురు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండటం, పార్టీ నామినీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు వస్తున్న వార్తలతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్టు ఆర్జేడీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
పాట్నా: ఛట్ ఫెస్టివల్ పూర్తికావడంతో బిహార్ (Bihar)లో ఎన్నికల వేడి ఊపందుకుంది. అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్‌తో సందడి చేస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలపై బహిష్కరణ వేట్లు కూడా పడుతున్నాయి. 27 మంది నాయకులపై ప్రతిపక్ష ఆర్జేడీ (RJD) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించింది.
వివిధ నియోజకవర్గాల్లో పలువురు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండటం, పార్టీ నామినీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు వస్తున్న వార్తలతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్టు ఆర్జేడీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బహిష్కరణకు గురైన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చోటే లాల్‌రాయ్, మమ్మద్ క్రమాన్, మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు.
మహాఘట్‌బంధన్ మేనిఫెస్టో
విపక్ష మహాఘట్‌బంధన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, విద్య, రైతుల సంక్షేమ వంటి కీలక అంశాలు మేనిఫెస్టోలో చోటుచేసుకోనున్నాయి. మహిళలకు ప్రతినెలా రూ.2.500 ఆర్థిక సాయం, రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్స, భూముల్లేని కుటుంబాలకు 3 నుంచి 5 సెంట్ల భూమి కేటాయించడం వంటి హామీలను ఇవ్వనుంది. బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
మాజీసీఎం ఓపీఎస్ జోస్యం.. రాష్ట్రంలో మళ్లీ డీఎంకే పాలనే.
జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి