Share News

Bihar Elections: 40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా

ABN , Publish Date - Oct 26 , 2025 | 06:31 PM

స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ వంటి ప్రముఖులు ఉన్నారు. సచిన్ పైలట్, భూపేష్ బఘేల్, గౌరవ్ గొగోయ్, కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవాని, దిగ్విజయ్ సింగ్, రణ్‌జీత్ రంజన్, తారిఖ్ అన్వర్ తదితరులు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నారు.

Bihar Elections: 40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా
Bihar Congress Star Campaigners

పాట్నా: కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ప్రచార బరిలోకి దింపుతోంది. తొలి విడత పోలింగ్ కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో ఒక జాబితాను ఆదివారంనాడు విడుదల చేసింది. ఆర్జేడీతో కలిసి విపక్ష 'ఇండియా' కూటమిగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

రాహుల్ సహా..

స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ వంటి ప్రముఖులు ఉన్నారు. సచిన్ పైలట్, భూపేష్ బఘేల్, గౌరవ్ గొగోయ్, కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవాని, దిగ్విజయ్ సింగ్, రణ్‌జీత్ రంజన్, తారిఖ్ అన్వర్ తదితరులు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ పాట్నా, గయ, దర్బంగ్‌పై దృష్టి సారిస్తారని, సామాజక న్యాయం, ఉపాధి కల్పన వంటి సందేశాత్మక ఈవెంట్లలో ఖర్గే, సోనియాగాంధీ పాల్గొంటారని తెలుస్తోంది. పైలట్, కన్హయ్య కుమార్, మేవాని వంటి యువ ప్రచారకర్తలతో యువతకు చేరువకావడం కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా ఉందని చెబుతున్నారు. 243 మంది సభ్యుల బిహర్ అసెంబ్లీకి నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.

ఇవి కూడా చదవండి..

రూ.10 కోట్లు ఇవ్వకుంటే మీ కొడుకుని చంపేస్తాం.. బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్

సల్మాన్ ఖాన్ బలూచిస్థాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం.. టెర్రరిస్ట్ అని ప్రకటించిన పాక్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 26 , 2025 | 06:45 PM