Bihar Elecitons: మాకు ఓటేస్తే ఉపాధి కోసం బిహార్ వదలి వెళ్లక్కర్లేదు.. ప్రశాంత్ కిషోర్ భరోసా
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:21 PM
సీతామర్హిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, ఇది జన్ సురాజ్ జన్మభూమి అని, మూడేన్నరేళ్ల క్రితం పార్టీ పుట్టిందని చెప్పారు. భయంతో బీజేపీకో, లాలూకో ఓటు వేయాల్సిన పనిలేదని, బిహార్‌లో రాజకీయ వెట్టిచాకిరీకి తాము ముగింపు పలకాలని తమ పార్టీ గట్టిగా తీర్మానించుకుందని తెలిపారు.
సీతామర్హి: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనే పుష్కలమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఛాఠ్ పండుగ కోసం ఇంటికి వచ్చిన ప్రజలు ఇకముందు ఉపాధి కోసం బిహార్ విడిచి వెళ్లనవసరం లేదని జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) అన్నారు. బిహార్‌లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.
సీతామర్హిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, ఇది జన్ సురాజ్ జన్మభూమి అని, మూడేన్నరేళ్ల క్రితం పార్టీ పుట్టిందని చెప్పారు. భయంతో బీజేపీకో, లాలూకో ఓటు వేయాల్సిన పనిలేదని, బిహార్‌లో రాజకీయ వెట్టిచాకిరీకి ముగింపు పలకాలని తమ పార్టీ గట్టిగా తీర్మానించుకుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులతోనే సర్దుకుపోవాలా, మార్పు కావాలా అనేది మరో పది, పదిహేను రోజుల్లోనే ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు.
గుజరాత్‌లో రూ.లక్ష కోట్లతో బుల్లెట్ ట్రైన్ నిర్మిస్తుంటే, బిహార్ ప్రజలు మాత్రం ఛాఠ్ పండుగకు ఇంటికి రావాలంటే కనీసం ఒక సీటు కూడా దొరక్క అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని బిహార్ ప్రజలు కోరుకుంటున్నారో లేదో తేల్చుకోవాలని సూచించారు. కాగా, రాష్ట్రంలోని 243 సీట్లలోనూ జన్ సురాజ్ పోటీలో ఉంది. నవంబర్ 6,11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ యోధుడు.. మన్‌కీ బాత్‌లో 'కొమురం భీం'ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ
పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి