ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇద్దరు ఈసీలు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక ఓ సభలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 'చోర్ చోర్' అంటూ ప్రియాంక మద్దతుదారులు నినాదాలు చేయడం కనిపించింది.
3,75,13,302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు కాగా.. 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్ల కోసం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్ల రాక మొదలైంది.
తొలి విడత పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాల్లో అందరి దృష్టి ప్రధానంగా వైశాలి జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంది. ఇక్కడి నుంచి ఆర్జేడీ నుంచి 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు.
కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ బంధువు అయిన జ్యోతి మాంఝీ ఓపెన్ జీప్‌లో సిల్‌బట్టా ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా కొందరు ఆమెపై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. ఒక రాయి ఆమెకు తగలడంలో గాయపడ్డారు.
తేజ్ ప్రతాప్ యాదవ్‌పై ఆర్జేడీ ఇటీవల బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఆయన కొత్తగా 'జన్‌శక్తి జనతా దళ్' పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆపార్టీ 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు 'నమో యాప్' ద్వారా పార్టీ మహిళా కార్యకర్తలతో మాట్లాడారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దగ్గరుండి తాను చూశానని, భారీ మెజారిటీతో ఎన్డీయే గెలుస్తుందని తాను చెప్పగలనని అన్నారు.
మొకామా ప్రాంతంలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ తరఫున లలన్ సింగ్ ఇటీవల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పోలింగ్ రోజున విపక్ష నేతలను ఇళ్ల నుంచి బయటకు రానీయరాదని, ఇళ్లకు తాళాలు వేయాలని సూచించారు.
తేజస్విని సీఎం చేయాలని లాలూ, రాహుల్ గాంధీని ప్రధాని కావాలని సోనియాగాంధీ కలలు కంటున్నారని, అయితే వాళ్లు ఆ విషయం మరిచిపోవచ్చని, ఎందుకుంటే ఆ రెండు పోస్టులు ఖాళీగా లేవని అమిత్‌షా ఛలోక్తి విసిరారు. ఇక్కడ సీఎంగా నితీష్, అక్కడ పీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారిందని అమిత్‌షా అన్నారు. ఇలా చేసిన ప్రతిసారి బీజేపీకి ప్రజలు ఘనవిజయం కట్టబెట్టారని, ఈసారి కూడా అదే జరుగుతుందని, కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని అన్నారు.