Share News

Bihar Assembly Elections 2025: బిహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ పూర్తి.. పోలింగ్ శాతం ఎంతంటే..

ABN , Publish Date - Nov 06 , 2025 | 09:50 PM

3,75,13,302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు కాగా.. 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్ల కోసం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Bihar Assembly Elections 2025: బిహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ పూర్తి.. పోలింగ్ శాతం ఎంతంటే..
Bihar Assembly Elections 2025

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ పూర్తయింది. గురువారం 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ 121 స్థానాల్లో 1,314 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ 1,314 మంది అభ్యర్థులలో 1,192 మంది పురుషులు కాగా.. 122 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలోని దాదాపు 3.75 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


మొత్తం 3,75,13,302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు కాగా.. 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్ల కోసం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 36,733 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. మిగిలిన 8,608 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించింది.


బిహార్ చరిత్రలో మొదటి సారి..

బిహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్‌పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గురువారం రాత్రి ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం.. బిహార్ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా తొలి దశలో పోలింగ్ శాతం నమోదు అయ్యింది. పోలింగ్ శాతం 64.66 శాతంగా ఉంది. రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎమ్ బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఏర్పాటు చేయటంపై ఓటర్లు సంతోషం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

బస్సులో బరితెగించిన కామాంధుడు.. పక్కన కూర్చున్న అమ్మాయితో..

కోర్టు తీర్పుతో కొలువులు కోల్పోనున్న 45 మంది ప్రొఫెసర్లు

Updated Date - Nov 06 , 2025 | 09:51 PM