Man Caught On Video: బస్సులో బరితెగించిన కామాంధుడు.. పక్కన కూర్చున్న అమ్మాయితో..
ABN , Publish Date - Nov 06 , 2025 | 09:17 PM
ఓ బస్టాప్ దగ్గర ఓ వ్యక్తి బస్సు ఎక్కాడు. నేరుగా వచ్చి ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు. బస్సు కొంత దూరం పోగానే అతడు తన పాడు బుద్ధి బయటపెట్టాడు. మెల్లగా ఆ యువతిని ముట్టుకోసాగాడు.
ఈ మధ్య కాలంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి. కొంతమంది కామాంధులు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల దగ్గరి వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా, ఓ కామాంధుడు జనం ఫుల్లుగా ఉన్న బస్సులో రెచ్చిపోయాడు. ఓ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడు. ఆ అమ్మాయి అతడికి సరిగా బుద్ధి చెప్పింది. అందరి ముందు పరువు తీసింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఓ యువతి బస్సులో కూర్చుని ఉంది. కొద్దిసేపటి తర్వాత ఓ బస్టాప్ దగ్గర ఓ వ్యక్తి బస్సు ఎక్కాడు. నేరుగా వచ్చి ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు. బస్సు కొంత దూరం పోగానే అతడు తన పాడు బుద్ధి బయటపెట్టాడు. మెల్లగా ఆ యువతిని ముట్టుకోసాగాడు. ఇది గుర్తించినా ఆమె మాత్రం అతడ్ని ఏమీ అనలేదు. అతడికి తెలియకుండా వీడియో తీయటం మొదలెట్టింది.
ఆమె వీడియో తీస్తోందని తెలీక ఆ వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. యువతి ఏమీ అనకుండా ఉండేసరికి టీ షర్టు లోపల చెయ్యి పెట్టాడు. అతడి ఆగడాలు పెచ్చు మీరటంతో ఆ యువతి ఆగ్రహించింది. అతడ్ని తిడుతూ కొట్టసాగింది. యువతి అరుపులు విని కండెక్టర్ అక్కడికి వచ్చాడు. కండెక్టర్‌కు ఆమె ఈ విషయం చెప్పింది. కండెక్టర్ అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 ఏళ్లు.. రేపటినుంచే ఉత్సవాలు..
కారు బోనెట్‌లో భారీ కొండ చిలువ.. ఒక్కసారిగా కలకలం..