Giant Python In Car Bonnet: కారు బోనెట్‌లో భారీ కొండ చిలువ.. ఒక్కసారిగా కలకలం..
ABN , Publish Date - Nov 06 , 2025 | 07:32 PM
ఓ వ్యక్తి కారు బోనెట్‌లో భారీ కొండ చిలువ బయటపడింది. బోనెట్ ఓపెన్ చేసి చూసి అతడు షాక్ అయ్యాడు. గట్టిగా కేకలు వేసి పక్కన ఉన్న వాళ్లను అక్కడికి పిలిచాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ మధ్య కాలంలో పాములు జనావాసాల్లోకి రావటం బాగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా విషపూరిత పాములు హెల్మెట్లు, షూలలో దర్శనమిస్తున్నాయి. బైకులు, కార్లలోకి దూరి జనాన్ని భయపెడుతున్నాయి. తాజాగా, ఓ కారు బోనెట్‌లో భారీ కొండ చిలువ వెలుగు చూసింది. ఆ పామును చూసి జనం భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబైకి చెందిన ఓ వ్యక్తి షాపులోకి వెళుతూ.. తన కారును రోడ్డు పక్క పార్క్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత కారు దగ్గరకు వచ్చాడు. కారులోకి ఎక్కి కూర్చోగా ఓ వింత శబ్ధం వచ్చింది. ఆ శబ్ధం ఏంటో అతడికి అర్థం కాలేదు. ఎంతో శ్రద్ధగా శబ్ధాన్ని విన్నాడు. కారు బోనెట్ నుంచి ఆ శబ్ధం వస్తోందని గుర్తించాడు. బోనెట్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. బోనెట్‌లో ఓ పెద్ద కొండ చిలువ దాక్కుని ఉంది. గట్టిగా కేకలు వేసి పక్కన ఉన్న వాళ్లను అక్కడికి పిలిచాడు.
క్షణాల్లోనే చుట్టూ జనం మూగారు. పాములను పట్టుకునే వారికి సమాచారం వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత పాములు పట్టుకునే వారు అక్కడికి వచ్చారు. ఎంతో కష్టం మీద ఆ కొండ చిలువను కారు బోనెట్ నుంచి పక్కకు తీశారు. బకెట్‌లో వేసుకుని తీసుకుపోయారు. దీంతో కారు ఓనర్ ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి’..‘షూలు, హెల్మెట్లలో కూడా పాములు బయటపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్లీజ్.. నాకు హెల్ప్ చెయ్యండి.. వీధి కుక్క హాస్పిటల్‌కు వచ్చి ఏం చేసిందో చూడండి..
ద్రోణి ప్రభావం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు..