Share News

Andhra Pradesh Weather: ద్రోణి ప్రభావం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు..

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:26 PM

నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Andhra Pradesh Weather: ద్రోణి ప్రభావం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు..
Andhra Pradesh Weather

అమరావతి : ద్రోణి ప్రభావంతో రేపు (శుక్రవారం) ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దాని కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఈ రోజు(గురువారం) వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ రోజు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

మార్కెట్‌లో ఫేక్ బంగాళాదుంపలు.. ఇలా గుర్తించండి..

మహిళ దొంగతనం.. జాబ్‌లో చేరిన మొదటిరోజే..

Updated Date - Nov 06 , 2025 | 05:56 PM