Fake Potatoes Identify: మార్కెట్‌లో ఫేక్ బంగాళాదుంపలు.. ఇలా గుర్తించండి..
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:57 PM
మార్కెట్‌లో నకిలీ బంగాళాదుంపలు ఎక్కువైపోయాయి. వాటిని తినటం వల్ల జనం అనారోగ్యం పాలవుతున్నారు. మరి.. మన ప్రాణాలకు ముప్పు తెచ్చే నకిలీ బంగాళాదుంపల్ని గుర్తించటం ఎలా?..
ఈ మధ్య కాలంలో కొంతమంది అక్రమార్కులు తినే ప్రతీ వస్తువును కల్తీ చేసేస్తున్నారు. డబ్బుల కోసం మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కల్తీ కూరగాయలు, పండ్లు తినటం వల్ల చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు అనారోగ్యం పాలవుతున్నారు. కల్తీ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. ఆఖరికి బంగాళాదుంపల్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. బంగాళాదుంపలు ఎక్కువ రోజులు ప్రెష్‌గా ఉండటానికి కెమికల్స్‌ను వాడుతున్నారు. వాటిపై ఆర్టిఫిషియల్ కోటింగ్ వేస్తున్నారు.
ఇలా చేయటం వల్ల అవి తాజాగా కనిపిస్తాయి. చూడ్డానికి ఎంతో బాగా కనిపించే నకిలీ బంగాళాదుంపల్ని తినటం వల్ల చాలా రకాల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా నకిలీ బంగాళాదుంపల్ని తినటం వల్ల ధీర్ఘకాలంలో ఆర్గాన్స్ చెడిపోయే ప్రమాదం ఉంది. మరి, మన ప్రాణాలకు ముప్పు తెచ్చే నకిలీ బంగాళాదుంపల్ని గుర్తించటం ఎలా?..
నకిలీ బంగాళాదుంపల్ని ఇంట్లోనే గుర్తించండిలా..
మొదటగా వాటి వాసన చూడండి. కల్తీ కాని బంగాళాదుంపలు మట్టి వాసన వస్తాయి. అలా కాకుండా కెమికల్స్ వాసన వస్తే అవి కచ్చితంగా కల్తీ చేసినవే అని గుర్తించండి.
లోపల, బయట బంగాళాదుంపల రంగును చూడండి. మీరు కట్ చేయగానే లోపల, బయట ఒకే రంగు ఉంటే అవి మంచివి. లేకపోతే కల్తీ చేసినట్లు అర్థం.
బంగాళాదుంపల్ని చేతితో రుద్దగానే పై తోలు ఈజీగా ఊడివస్తే అది కెమికల్స్‌తో కల్తీ చేసినదని గుర్తించండి.
ఓ పెద్ద టబ్ నిండా నీటిని తీసుకోండి. వాటిలో బంగాళాదుంపల్ని వేయండి. సహజ సిద్దమైన బంగాళాదుంపలు నీటిలో మునిగిపోతాయి. కెమికల్స్ కలిపిన బంగాళాదుంపలు ఆ కెమికల్స్ కారణంగా నీటిపై తేలే అవకాశం ఉంది.
సహజ సిద్ధమైన బంగాళాదుంపల తోలు రఫ్‌గా, పల్చగా ఉంటుంది. నకిలీ వాటికి అలా కాదు. తోలు చాలా మృదువుగా, మందంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మహిళ దొంగతనం.. జాబ్‌లో చేరిన మొదటిరోజే..
బాపట్లలో లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులు దుర్మరణం