Share News

Telangana High Court: కోర్టు తీర్పుతో కొలువులు కోల్పోనున్న 45 మంది ప్రొఫెసర్లు

ABN , Publish Date - Nov 06 , 2025 | 08:54 PM

తెలంగాణ యూనివర్సిటీ నియామకాల కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

Telangana High Court: కోర్టు తీర్పుతో కొలువులు కోల్పోనున్న 45 మంది ప్రొఫెసర్లు

హైదరాబాద్, నవంబర్ 06: తెలంగాణ యూనివర్సిటీ‌లో 2012 నాటి నియామకాలు చెల్లవని హైకోర్టు తన తుది తీర్పులో స్పష్టం చేసింది. 2012లో జారీ చేసిన నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి.. ఈ తీర్పును వెలువరించింది. ఈ తాజా తీర్పు కారణంగా 45 మంది ప్రొఫెసర్లు.. తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు అవుతుంది.


అయితే కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చంటూ తెలంగాణ యూనివర్సిటీకి ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. 2012లో 91 పోస్టులకు తెలంగాణ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2012లో విడుదలైన సదరు నోటిఫికేషన్‌లో చేర్చాల్సిన పోస్టులు చేర్చక పోవడం.. అలాగే చేర్చకూడని పోస్టులు చేర్చారంటూ పలువురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.


ఈ నేపథ్యంలో దాఖలపై పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. గురువారం తన తుది తీర్పును హైకోర్టు వెలువరించింది. మరోవైపు.. సబ్జెక్టుల రోస్టర్ పాయింట్లు మారిపోయాయని ఈ సందర్భంగా హైకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకు వెళ్లారు.

Updated Date - Nov 06 , 2025 | 09:58 PM