Bihar Elections: హెచ్ఏఎం అభ్యర్థి జ్యోతి మాంఝీపై రాళ్ల దాడి
ABN , Publish Date - Nov 05 , 2025 | 07:50 PM
కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ బంధువు అయిన జ్యోతి మాంఝీ ఓపెన్ జీప్‌లో సిల్‌బట్టా ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా కొందరు ఆమెపై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. ఒక రాయి ఆమెకు తగలడంలో గాయపడ్డారు.
బారాచట్టీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ప్రచారంలో అభ్యర్థిపై దాడి ఘటన చోటుచేసుకుంది. గయలోని బారాచట్టీ నియోజకవర్గం నుంచి హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతి మాంఝీ (Jyoti Manjhi)పై బుధవారం నాడు దాడి జరిగింది. రెండో విడత ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమె ప్రచార కాన్వాయ్‌పై కొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తలకు గాయమైంది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ బంధువు అయిన జ్యోతి మాంఝీ ఓపెన్ జీప్‌లో సిల్‌బట్టా ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా కొందరు ఆమెపై రాళ్లు రువ్వారు. ఒక రాయి ఆమెకు తగలడంతో గాయపడ్డారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రమాదం నుంచి బయటపడినట్టు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
జాతీయ ప్రజాస్వామ్య కూటమి(NDA) భాగస్వామిగా హెచ్ఏఎం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. జితిన్ రామ్ మాంఝీ కోడలు దీపా కుమారి కూడా ఈ ఎన్నికల్లో ఇమాంగంజ్ నుంచి పోటీ చేస్తుండగా, అల్లుడు ప్రఫుల్ కుమార్ మాంఝీ జముయి జిల్లా సికంద్రా నుంచి పోటీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..
ఎస్ఐఆర్‌ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా.. రాహుల్ ఆరోపణలపై ఈసీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి