Share News

Bihar Elections: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..

ABN , Publish Date - Nov 05 , 2025 | 01:08 PM

రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తారు. గతేడాది హర్యానా ఎన్నికల సందర్భంగా వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు జరిగాయని అన్నారు. అక్కడ ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ అని ఆరోపించారు.

Bihar Elections: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..
Haryana Assembly Elections Vote Fraud

ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నానని అన్నారు (Rahul Gandhi Vote Chori Allegations). కాంగ్రెస్ గెలుపును ఓటమిగా మార్చేందుకు వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు.

‘హర్యానాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25 లక్షల ఓట్లు నకిలీవే’ అంటూ ఢిల్లీలో తాజాగా నిర్వహించిన పత్రికా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. తన బృందం 5.21 లక్షల డూప్లికేట్ ఓటన్లు గుర్తించిందని అన్నారు. హర్యానాలోని ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీనేనని స్పష్టం చేశారు (Haryana Assembly Elections Fraud allegations). తన ఆరోపణలపై ఓ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఒక బ్రెజిల్ నటి ఫొటోతో, సీమా, స్వీటీ, సరస్వతి వంటి పలు పేర్లతో ఏకంగా 22 సార్లు నకిలీ ఓట్లు వేశారని అన్నారు.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశాయి. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని గుర్తు చేశాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టులో మాత్రం కేవలం 22 ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అంటే, ఎన్నికల ఫలితాలకు న్యాయపరమైన సవాళ్లు పరిమితమనేందుకు ఇది సూచన అని ఈసీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 74 శాతం తిరస్కరణ.. షాకిచ్చిన కెనడా

ఇంగ్లిష్ టెస్టులో విఫలం.. యూఎస్‌లో భారతీయ ట్రక్ డ్రైవర్లకు షాక్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 02:35 PM