Share News

EC On Rahul Voti Chori: ఎస్ఐఆర్‌ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా.. రాహుల్ ఆరోపణలపై ఈసీ

ABN , Publish Date - Nov 05 , 2025 | 02:54 PM

పౌరసత్వ వెరిఫికేషన్‌తో పాటు డూప్లికేట్లను, చనిపోయిన వారిని, చిరునామా మార్చుకున్న ఓటర్లను తొలగించేందుకు చేపట్టిన ఎస్ఐఆర్‌ను రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ఈసీ ప్రశ్నించింది.

EC On Rahul Voti Chori: ఎస్ఐఆర్‌ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా.. రాహుల్ ఆరోపణలపై ఈసీ
Election commission with Rahul gandhi

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పును బీజేపీ తారుమారు చేసిందని, 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్ (Election Commission) తోసిపుచ్చింది ఆయన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది. హర్యానాలో ఓటర్ల జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని వివరించింది. హర్యానా ఎన్నికల ఫలితాన్ని బీజేపీ చోరీ చేసిందని, గెలుపు కోసం ఎన్నికల కమిషన్‌తో ఆ పార్టీ కుమ్మక్కయిందని రాహుల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈసీ తాజా వివరణ ఇచ్చింది.


హర్యానాలో కాంగ్రెస్‌కు దక్కాల్సిన అద్భుత విజయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా 'ఆపరేషన్ సర్కార్ చోరీ' జరిగిందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు బీజేపీతో కుమ్మక్కయ్యారని అన్నారు. దీనిపై ఈసీ స్పందిస్తూ, 90 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 22 ఎలక్షన్ పిటిషన్లు మాత్రమే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపింది. బూత్‌లలో ఉన్న కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్ల పాత్రను ఈసీ నిలదీసింది. ఆ పార్టీ పోలింగ్ ఏజెంట్లు ఏం చేస్తున్నట్టు? ఓటరు ఎవరైనా అప్పటికే ఓటు వేసినట్టు అనుమానం వచ్చినా, ఓటరు ఐడెంటిటీపై అనుమానం వచ్చినా అప్పుడే అభ్యంతరం వ్యక్తి చేసి ఉండొచ్చని పేర్కొంది.


ఎస్ఐఆర్‌పై మీ వైఖరి ఏంటి?

పౌరసత్వ వెరిఫికేషన్‌తో పాటు డూప్లికేట్లను, చనిపోయిన వారిని, చిరునామా మార్చుకున్న ఓటర్లను తొలగించేందుకు చేపట్టిన ఎస్ఐఆర్‌ను రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని ఈసీ ప్రశ్నించింది. కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తలేదని ప్రశ్నించింది. ఒకే పేరు పదేపదే రాకుండా నిరోధించేందుకు రివిజన్ జరిగినప్పుడు కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు అభ్యంతరం చెప్పి ఉండవచ్చని పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకూ బిహార్‌లో ఎస్ఐఆర్ సమయంలో కూడా కాంగ్రెస్ ఎందుకు అప్పీల్ చేయలేకపోయిందో చెప్పాలని పేర్కొంది.


రాహుల్ ఏమన్నారు?

హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, టాప్-5 ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పినప్పటికీ బీజేపీ గెలిచిందని న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ తెలిపారు. ఒక నియోజకవర్గంలో ఒక ఫోటోతో వంద ఓట్లున్నాయని, అనేక బూతులలో ఫేక్ ఓట్లున్నాయని, అక్రమాలు బయటకు రావద్దని ఎన్నికల సంఘం సీసీటీవీ ఫుటేజ్‌ను డిలీట్ చేసిందని ఆరోపించారు. బ్రెజిలియన్ మోడల్, యూపీ బీజేపీ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు, ఓటర్ల తొలగింపుతో హర్యానాలో గెలిచారని అన్నారు. యూపీ, హర్యానాలో వేల సంఖ్యల్లో డూప్లికేట్ ఓటర్లున్నారని, యూపీలో ఓటు వేసే వ్యక్తికి హర్యానాలో కూడా ఓటు ఉందని తెలిపారు. బిహార్‌లోనూ ఓట్ల చోరీ జరుగుతుందని, అక్కడ ఎన్నికల తరువాత ఓట్ల చోరీ అంశాన్ని బయటపెడతామని అన్నారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 04:23 PM