Share News

Mirzapur Train Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి

ABN , Publish Date - Nov 05 , 2025 | 11:46 AM

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది.

Mirzapur Train Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌: మిర్జాపూర్ చునార్ జంక్షన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే పట్టాలు దాటుతున్న కొందరి ప్రయాణికులను వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.


మృతులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారు ప్యాసింజర్ రైలులో చునార్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకొని పట్టాలు దాటుతుండగా వారిని రైలు ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం యోగి ఆదేశించారు.


Also Read:

నేడు కార్తీక పౌర్ణమి.. ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షమే..

గుడ్ న్యూస్.. మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Updated Date - Nov 05 , 2025 | 01:07 PM