Share News

Viral Video: అనుకోకుండా కలిసిన బ్రదర్స్.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 05 , 2025 | 06:21 PM

తేజ్ ప్రతాప్ యాదవ్‌పై ఆర్జేడీ ఇటీవల బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఆయన కొత్తగా 'జన్‌శక్తి జనతా దళ్' పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆపార్టీ 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 'మహాగఠ్‌బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు.

Viral Video: అనుకోకుండా కలిసిన బ్రదర్స్.. ఏం జరిగిందంటే..
Tejashwi yadav and Tej Pratap

పాట్నా: బిహార్ ఎన్నికల్లో పార్టీల పరంగా ఒకరిపై మరొకరు వ్యతిరేక ప్రచారం సాగించిన తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav), తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) సోదరులు యాదృచ్ఛికంగా పాట్నా విమానాశ్రయంలో ఇటీవల ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


తేజ్ ప్రతాప్ యాదవ్‌పై ఆర్జేడీ ఇటీవల బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఆయన కొత్తగా 'జన్‌శక్తి జనతా దళ్' పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆపార్టీ 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 'మహాగఠ్‌బంధన్' తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు.


తేజస్వి, తేజ్ ప్రతాప్ ఒకరికొకరు ఎయిర్‌పోర్ట్‌లో తారసపడిన ఆసక్తికర ఘట్టాన్ని ప్రాడ్‌కాస్టర్ సందీష్ తన కెమెరాలో బంధించారు. తేజ్ ప్రతాప్ విమానాశ్రయంలోని వస్త్రదుకాణంలో నెహ్రూ జాకెట్ కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉండగా తేజస్వి ఆ దుకాణం పక్కనుంచే వెళ్తున్నారు. ఈ విషయాన్ని తేజ్ ప్రతాప్‌కు అతని సన్నిహతుడు ఒకరు చేరవేశారు. తేజస్వి అప్పుడే వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముకేష్ సహానితో కలిసి అక్కడకు వచ్చారు. తేజస్వికి సందీష్‌తో పరిచయం ఉండటంతో అతని వైపు తేజస్వి చేయి ఊపారు. తేజ్ ప్రతాప్‌తో మాత్రం నేరుగా మాట్లాడకుండా 'భయ్యా ఏదైనా కొనిపెట్టాడా?' అని సందీష్‌ను అడిగారు. ఆయన వెంటనే నాకు గిఫ్ట్ ఇచ్చారని చెప్పడంతో 'నవ్వు చాలా లక్కీ' అంటూ తేజస్వి నవ్వేశారు. ఆ వెంటనే ర్యాలీ ఉండటంతో తేజస్వి అక్కడ్నించి ముందుకు కదిలారు. ఆయన వైపే తేజ్ మౌనంగా చూస్తుండిపోయారు. ఆ తర్వాత తిరిగి ఆయన షాపింగ్‌ కొనసాగించారు. తేజస్వితో మాటలు లేవా? అని సందీష్ అడిగిన ప్రశ్నకు తేజ్ నవ్వుతూ సమాధానం దాటవేశారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. 25 లక్షల దొంగ ఓట్లంటూ..

ఎస్ఐఆర్‌ను మీరు సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా.. రాహుల్ ఆరోపణలపై ఈసీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 05 , 2025 | 06:28 PM