Share News

Amit Shah: లాలూ తాతలే దిగొచ్చినా ఆ సొమ్ము లాక్కోలేరు.. అమిత్‌షా సవాల్

ABN , Publish Date - Nov 04 , 2025 | 03:59 PM

తేజస్విని సీఎం చేయాలని లాలూ, రాహుల్ గాంధీని ప్రధాని కావాలని సోనియాగాంధీ కలలు కంటున్నారని, అయితే వాళ్లు ఆ విషయం మరిచిపోవచ్చని, ఎందుకుంటే ఆ రెండు పోస్టులు ఖాళీగా లేవని అమిత్‌షా ఛలోక్తి విసిరారు. ఇక్కడ సీఎంగా నితీష్, అక్కడ పీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు.

Amit Shah: లాలూ తాతలే దిగొచ్చినా ఆ సొమ్ము లాక్కోలేరు.. అమిత్‌షా సవాల్
Amit shah

దర్బంగా: ఎన్నికల సమయంలో జీవికా దీదీల ఖాతాల్లోకి బిహార్ ప్రభుత్వం రూ.10,000 జమ చేసిన సొమ్మును ఉపసంహరించుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌కు రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఫిర్యాదు చేయడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amits Shah) తప్పుపట్టారు. ఆర్జేడీ నేతలు ఆ సొమ్ములను దోచుకోవాలని చూస్తున్నారని, జీవికా దీదీలు లాలూ, తేజస్విని పట్టించుకోనవసరం లేదని అన్నారు. ఆ నేతలకు చెందిన మూడుతరాల వారు దొగొచ్చినా మహిళల ఖాతాలో జమచేసిన సొమ్మును దోచుకోలేరని దర్బంగాలో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో ఆయన స్పష్టం చేసారు.


వేకెన్సీలు లేవు

తేజస్విని సీఎం చేయాలని లాలూ, రాహుల్ గాంధీని ప్రధాని కావాలని సోనియాగాంధీ కలలు కంటున్నారని, అయితే వాళ్లు ఆ విషయం మరిచిపోవచ్చని, ఎందుకుంటే ఆ రెండు పోస్టులు ఖాళీగా లేవని అమిత్‌షా ఛలోక్తి విసిరారు. ఇక్కడ సీఎంగా నితీష్, అక్కడ పీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారని చెప్పారు.


ఎన్డీయే విజన్ ఇదే..

బిహార్ అభివృద్ధే ఎన్డీయే విజన్ అని అమిత్‌షా చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ కౌషల్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాకు ఒక ఫ్యాక్టరీ, 10 కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తరహాలో బిహార్‌లోనూ డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. రూ.850 కోట్లతో సీతామాత ఆలయం నిర్మిస్తున్నారని, ఆలయ నిర్మాణం పూర్తికాగానే వందేభారత్ రైళ్లతో అయోధ్యతో సీతామర్హికి అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు.


లోటస్ బటన్ నొక్కండి

ఓటర్లు తప్పనిసరిగా లోటస్ గుర్తుకు ఓటు వేయాలని, మీ ఓటు కేవలం ఎమ్మెల్యేను ఎన్నుకోవడమే కాకుండా జంగిల్ రాజ్ తిరిగి రాకుండా చేస్తుందని అమిత్‌షా పిలుపునిచ్చారు. లాలూ-రబ్రీ హయాంలో 15 ఏళ్ల పాటు సాగిన ఆటవిక రాజ్యం తిరిగి రావాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. బిహార్ అభివృద్ధికి లాలూ-రబ్రీ చేసిందేమీ లేదని, ఇప్పుడు బిహార్ వాసులు ఎయిమ్స్‌కు వెళ్లాలంటే ఢిల్లీకో, పాట్నాకో వెళ్లనవసరం లేదని, దర్బంగా ఎయిమ్స్‌లోనే చికిత్స దొరకుతోందని చెప్పారు. లాలూ హయాం స్కాములమయమని, కాంగ్రెస్‌కు రూ.12 లక్షల కోట్ల స్కాముల్లో ప్రమేయ ఉందని అన్నారు. సీఎం నితీష్, ప్రధాని మోదీపై ఒక్క కుంభకోణం ఆరోపణలు కూడా లేవన్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

ఆ నిబంధన వద్దే వద్దు

సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడింది..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 04 , 2025 | 04:04 PM