స్థలాల పేరిట.. రుణాల దందాతో జిల్లా సహకార బ్యాంకు పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోయింది.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎన్టీఆర్ ఉచిత వైద్యసేవలకు రోగులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కారణాలపై జిల్లాలోని రెండు నెట్‌వర్క్ ఆసుపత్రులకు కలెక్టర్ వెట్రిసెల్వి జరిమానా విధించారు.
ఆర్టీసీ పెట్రోల్ బంకులో నిధుల దుర్వినియోగంలో కిందిస్థాయి సిబ్బంది నలు గురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో చాలా కాలం కిందట పనిచేసిన అధికారులను విచారణ లోకి తీసు కోకుండా కిందిస్థాయి ఉద్యోగులపై వేటు వేయడంపై దుమారం రేగు తోంది.
విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య వారధిగా మారిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ వచ్చే నెల 5న నిర్వహించనున్నారు.
పట్టణాల్లో మునిసిపల్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
ఏలూరులో మంగళవారం ఉదయం మావోయిస్టుల అరెస్ట్ నుంచి బుధవారం రాత్రి ఏడు గంటలకు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే వరకు అడుగడుగునా క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది.
మరో అల్పపీడనం అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా వరి రైతులు ముమ్మరంగా మాసూళ్లు చేస్తున్నారు. చాలా వరకు ధాన్యం కల్లాల్లోనే ఉన్నది.
మంగళవారం ఉదయం ఏలూరు నగరం ప్రశాంతంగా వుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా వున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. నగరంతోపాటు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకంలో ఈ ఏడాది రెండో విడత కింద రైతులకు సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి.
పోతునూరు భోగేశ్వరస్వామి సహకార సొసైటీలో మాజీ అధ్యక్షుడు దూళిపాళ నాగేంద్రవరప్రసాద్(బజ్జీ) హయాంలో జరిగిన అవినీతి లెక్కతేలింది.