Share News

టిడ్కో ఇళ్లు సిద్ధం..!

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:56 AM

ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేయాలనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిడ్కో భవన నిర్మాణాలు చేపట్టాయి.

టిడ్కో ఇళ్లు సిద్ధం..!
నూజివీడులో టిడ్కో గృహాలు

నూజివీడులోనూ చురుగ్గా పనులు.. లబ్ధిదారులు హర్షం

ప్రతి ఒక్కరి సొంత ఇంటి కలను నిజం చేయాలనే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిడ్కో భవన నిర్మాణాలు చేపట్టాయి. వైసీపీ అధికారంలోకి రాగానే వీటికి చెదలు పట్టించారు. ఉగాది నాటికి తొలి విడత ఇళ్లను పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలలో పనులు పట్టాలెక్కాయి.

ఏలూరు టూ టౌన్‌/నూజివీడు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి):లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అప్పగించే చర్యలను ప్రభు త్వం వేగవంతం చేసింది. ఏడేళ్ల నుంచి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న లబ్ధిదా రులకు మొదటి విడత ప్రారంభించిన గృహా లను ఉగాది పండుగకు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ చేశారు. ఏలూరు, నగర పాలక సంస్థ పరిధిలో టిడ్కో గృహాలను 2వ విడత ప్రారంభించిన వాటిని జూన్‌ నాటికి అందజేసేలా పనులు ప్రారంభించారు. 2018 లో ప్రారంభించిన గృహాలు 2019 నాటికి దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. నాటి తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధిదారులకు అప్ప గించే క్రమంలో ఎన్నికల కోడ్‌ రావడంతో ఆగిన గృహాలు దాదాపు పాడయ్యే దశకు చేరుకున్నాయి. టిడ్కో గృహాలలో పిచ్చి మొక్కలు, పాముల పుట్టలు, ఏర్పడ్డాయి. కొన్ని గృహాలకు స్లాబ్‌లు ఊడిపోయే పరిస్థితి ఏర్పడింది. గోడలు పగుళ్లు ఏర్పడ్డాయి. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో వీటి ఊసెత్తలేదు. కూటమి ప్రభుత్వం రాగానే వీటికి మరమ్మ తులు ప్రారంభించి, నూతన గృహాలుగా తయారు చేస్తున్నారు. ఏలూరులో అప్పటి టీడీపీ ప్రభుత్వం 11,816 టిడ్కో గృహాలను పేదలకు మంజూరు చేసింది. వీటిలో 6,480 ఇళ్లు మొదటి విడతగా ప్రారంభించారు. వీట న్నిటికి బ్యాంకులతో అగ్రిమెంట్‌ జరిగింది. బ్యాంకు లోన్‌లు మంజూరుచేశారు. ఈ లోన్‌లతో వచ్చిన డబ్బును వైసీపీ ప్రబుత్వం సొంత అవసరాలకు వాడుకుంది. లబ్ధిదారులకు బ్యాంకులు ఈఎంఐలు కట్టమని నోటీసులు పంపారు. డబ్బులు కట్టించుకుని మరీ గృహాలు అప్పజెప్పకుండా 2208 గృహాలు మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం అంగీకరిం చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2208 గృహాలను ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది. పోణంగిలో కట్టిన ఈ గృహాలకు అధికారులు మరమ్మత్తులు చేశారు. రంగులు వేస్తున్నారు. జూన్‌ నాటికి పనులు పూర్తి చేసి లబ్ధిదారు లకు అప్పగిస్తామని టిడ్కో ఎగ్జిక్యూటీ వ్‌ ఇంజనీర్‌ నారాయణరావు తెలిపారు.

నూజివీడులో పనులు ప్రారంభం

నూజివీడు మున్సిపల్‌ పరిధిలో ఎంఆర్‌ అప్పారావు కాలనీలో నిర్మిస్తున్న టిడ్కో భవన నిర్మాణాలను తిరిగి ప్రారంభించడంతో లబ్ధి దారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పీఎంఏవై ఎన్టీఆర్‌ కాలనీలో లబ్ధిదారుల్లో ఆశలు చిగురి స్తున్నాయి. పీఎంఏవై ఎన్టీఆర్‌ కాలనీలో భాగంగా నూజివీడు మున్సిపల్‌ పరిధిలో మొత్తం 4,030 ప్లాట్‌లను మంజూరు చేయ గా 2,670 మంది లబ్ధిదారుల వాటా చెల్లిం చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శర వేగంగా నిర్మాణ పనులను చేపట్టి 2019 ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు కేటాయిం చారు. తనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ పట్టించుకోకపోవడంతో భవనాలు చిట్ట డవిని తలపించాయి. తిరిగి కూటమి ప్రభు త్వం ఏర్పడిన అనంతరం టిడ్కో భవనాలను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు చేప ట్టిన ప్రభుత్వం చివరి దశలో ఉన్న నిర్మాణా లను తిరిగి ప్రారంభించడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.

అప్పుల ఊబిలో లబ్ధిదారులు..

సొంత ఇంటి కలను నిజం చేసుకుందామ ని ఆశతో వాటా సొమ్ములు చెల్లించిన వారిలో రెండు విభాగాల లబ్ధిదారులు అప్పుల ఊబి లోకి కురుకుపోయారు. ఏ విభాగంలో రూ. 500 లబ్ధిదారుల వాటాతో 360 చ.అడుగులు, బి విభాగంలో రూ.50,000 లబ్ధిదారుని వాటాతో 400 చదరపు అడుగులు, సి విభాగంలో లక్ష రూపాయలు వాటాతో 430 చదరపు అడుగులు జి ప్లస్‌ త్రీ అపార్ట్ట్మెంట్‌లను కేటాయించారు. జీ ప్లస్‌ త్రీ భవనాలను పొందేవారు లబ్ధిదారుని వాటా పోను మూడు లక్షల నుంచి నాలుగు లక్షల 60 వేల వరకు లబ్ధిదారుల బ్యాంక్‌ రుణాల రూపేణ చెల్లించాలి. అందిన కాడికి అప్పులు తీసుకొచ్చి లబ్ధిదారుని వాటా చెల్లించిన లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం జలక్‌ ఇచ్చింది. జగనన్న ముఖచిత్రంతో పట్టాలను జారీ చేసిన గత వైసీపీ ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి లబ్ధిదారుల పేరుతో నూజివీడు నియోజకవర్గం నుంచి దాపు రూ.10 కోట్ల వరకు బ్యాంకుల నుంచి రుణం పొంది ప్రభుత్వ ఖాతాకు జమ చేసుకోవడంతో లబ్ధిదారులు అప్పుల ఊబిలోకి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్లపాటు రుణాల చెల్లింపునకు మారిటోరియం విధించగా, టిడ్కో భవన నిర్మాణాలు ఒక్క అడుగు ముందుకు పడకుండానే మారటోరియం సమయం పూర్తి కావడంతో లబ్ధిదారులకు బ్యాంకర్ల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. తదనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం గత ఏడాది వచ్చిన వరదల నేపథ్యంలో రుణాలు చెల్లింపులను వాయిదా వేయడంతో కొంత మేరకు లబ్ధిదారులకు ఉపశమనం కలిగింది. అయితే నివేసన గృహాలు పొందే సమయానికి పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయే పరిస్ధితుల్లో తమకు ప్రభుత్వం ఉపశమనం కలిగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

త్వరలో ఇళ్ల పట్టాల పంపిణీ

1045 లే అవుట్లలో 4,678 మంజూరుకు నిర్ణయం

ఏలూరు, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి):అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏలూరు జిల్లాలోని 1045 లే అవుట్లలో ఖాళీగా వున్న సెంటు స్థలం చొప్పున 4,678 పట్టాలు మంజూరు చేయనుంది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం గ్రామాల్లో సర్వేలు, పరిశీలనలను పూర్తిచేసింది. జిల్లాలోని నగరం, మునిసిపాలిటీ, గ్రామాల్లోని 510 ప్రాంతాల్లో 1045 లేవుట్లను గతంలో వేశారు. ఇందులో ఖాళీగా వున్న 4,678 స్థలాలకు ఇంటి పట్టాలను ఇచ్చేందుకు అధికారులు పరిశీలన చేశారు. వీటిలో నియోజకవర్గాల వారీగా.. కైకలూరులో 1,228, దెందులూరు 887, నూజివీడులో 631, చింతలపూడి 552, పోలవరం 451, ఏలూరు 270, ఉంగుటూరు 152తోపాటు ద్వారకా తిరుమల మండలంలో 507 స్థలాలు వున్నాయి. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే సెంటు చొప్పున (48 గజాలు) పట్టాలను జారీ చేయడానికి రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల జిల్లా సమీక్ష కమిటీ సమావేశం (డీఆర్‌సీ)లో ఇళ్ల పట్టాల కేటాయింపు చర్చ సాగింది. అర్హులు వుంటే వారికి వీటిని అందజేయాలని తీర్మానించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం త్వరలో పూర్తి స్పష్టత ఇవ్వనుంది.

Updated Date - Feb 11 , 2026 | 12:56 AM