ఆక్వాకు విద్యుత్ వెలుగులు
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:26 AM
కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఆక్వా రంగానికి విద్యుత్ వెలుగులను అందిం చేందుకు కృషి చేస్తోంది.
గోపవరంలో నిర్మాణం.. జిల్లాలోనే రెండో అతిపెద్దది
మరో మూడు నెలల్లో ప్రారంభం
కైకలూరు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఆక్వా రంగానికి విద్యుత్ వెలుగులను అందిం చేందుకు కృషి చేస్తోంది. ఆక్వారంగం అభివృద్ధి చెంది తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్న కైకలూరు నియోజకవర్గానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంది. 24 గంటల పాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో నూతన విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మాణం చేప ట్టారు. ప్రతి వేసవిలో విద్యుత్ కష్టాలను ఎదు ర్కొనే ఆక్వా రైతులకు, గృహ, వాణిజ్య విని యోగదారులకు ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో కష్టాలు తొలగనున్నాయి.
కైకలూరు మండలం గోపవరంలో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.32 కోట్ల వ్యయంతో 220/33 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. భీమడోలులో గతంలోనే అతి పెద్ద సబ్‌స్టేషన్ నిర్మించారు. ప్రస్తు త్తం రెండో అతిపెద్ద సబ్‌స్టేషన్‌ను గోపవరంలో నిర్మిస్తున్నా రు. ఈ సబ్‌స్టేషన్‌కు గుడివాడ– ఆకివీడు మధ్యలో సరఫరా అయ్యే విద్యుత్‌లైన్ల నుంచి ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా అతి తక్కువ సమ యంలోనే మరమ్మతులు నిర్వహించి విద్యుత్ సరఫరా చేసేలా అనువుగా ఉండేలా అధునా తన టెక్నాలజీతో కూడుకున్న కంట్రోల్ రూంను నిర్మాణం చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ వారానికి ఒకసారి ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తుండడంతో పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో సబ్‌స్టేషన్ అందుబాటులోకి రా నుంది. ఇది పూర్తయితే కైకలూరు, కలిదిండి మండలాలకు కోతలు లేని విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఆక్వా రైతులకు విద్యుత్ కోతలు తప్పుతాయి. మరోవైపు ఈ సబ్‌స్టేషన్‌లో కొత్తగా 20 మందికి ఉద్యోగావకశాలు వస్తాయి.
ఐదు నూతన సబ్‌స్టేషన్లకు ప్రతిపాదనలు..
గోపవరంలో అతిపెద్ద విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ మరింత నాణ్య మైన విద్యుత్ అందించడానికి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మరో ఐదుచోట్ల విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ట్రాన్స్‌కోకి ప్రతిపాదనలు చేశారు. ఇప్పటికే కలిదిండి మండలం తాడినాడ, కొండంగి గ్రామాల్లో నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. 33/11కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నారు. కైకలూరు మండలం పెంచికలమర్రు, మండవల్లి మండలం ఇంగిలిపాకలంక, ముదినేపల్లి మండలం వైవాక గ్రామాల్లో 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు రావాల్సి వుంది. ఈ ఐదు సబ్‌స్టేషన్లను రానున్న రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రయత్నం చేస్తున్నారు.