Share News

పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేయండి : కలెక్టర్‌

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:12 AM

గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే తగిన కార్యచరణ ప్రణా ళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారు లను ఆదేశించారు.

పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేయండి : కలెక్టర్‌
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

పోలవరం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే తగిన కార్యచరణ ప్రణా ళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారు లను ఆదేశించారు. పట్టిసీమలోని రివర్‌ ఇన్‌ అతిథి గృహంలో బుధవారం జరిగిన అధికారుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ ‘2027లో జరగనున్న గోదా వరి పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు నిర్వహించాం. పుష్కరాలను విజయ వంతంగా నిర్వహించడానికి అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. స్నాన ఘట్టాలను గుర్తించడం, తాగునీరు, పారిశుధ్యం, రవాణా, వైద్య శిబిరాలు, భద్రత, జనసమూహ నిర్వహణ, అత్యవసర సేవలు, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలి. పుణ్య స్నానాలు, పిండ ప్రదానాలు, ఏఏ ప్రముఖ ఆలయాల దర్శనాలకు వెళతారనే వివరాలను సిద్ధం చేయాలి’ అన్నారు. సమావేశంలో ఏఎస్పీ సూర్యచంద్రరావు, ఆర్డీవో రమణ, ఐటీడీఏ పీవో రాములు నాయక్‌, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆలయ ఫౌండరు ట్రస్టీ కొచ్చర్లకోట వీరభద్రరావు , ఈవో వెంకటలక్ష్మి, తహసీల్దారు సాయిరాజు, సీఐ బాల సురేష్‌బాబు, ఎస్‌ఐ పవన్‌ కుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:12 AM