బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం
ABN , Publish Date - Feb 11 , 2026 | 10:17 AM
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఓ లారీ ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరు జిల్లా, ఫిబ్రవరి 11: జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందారు. బుధవారం జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ లారీ అదుపుతప్పి.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆపై బైక్‌ను ఈడ్చుకుంటూ వెళ్లి స్తంభానికి ఢీకొట్టి ఆగిపోయింది లారీ. ఈ ప్రమాదంలో బైకర్.. లారీ టైర్ కింద చిక్కుకుని స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుణ్ని బయటకు తీసేందుకు యత్నించారు. చివరకు మృతదేహాన్ని బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. లారీ ఒక్కసారిగా బీభత్సం సృష్టించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు..
Read Latest AP News And Telugu News